తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విమానయాన సంస్థ గురువారం 14 విమానాలతో సేవలు అందించింది. తాజాగా, శుక్రవారం కేవలం తొమ్మిది విమానాలను మాత్రమే నడిపిస్తోంది. శుక్రవారం జెట్ ఎయిర్వేస్‌కు చెందిన తొమ్మిది విమాన సర్వీసులే నడుస్తున్నాయని చెబుతున్నారు. వీటిలో రెండు బోయింగ్ 737, ఏడు ప్రాంతీయ జెట్ ఏటీఆర్‌లు ఉన్నాయి.
తాజా పరిణామాలపై కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పందించారు. జెట్ ఎయిర్వేస్ పరిస్థితులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విమానయాన సమస్యపై సమీక్ష జరపాలని విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఆదేశించామని, ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించి వారికి సరైన భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించామని సురేష్ ప్రభు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

జెట్ ఎయిర్వేస్ 120 విమాయాన సర్వీసుల నుంచి ఇప్పుడు కేవలం 9 విమానాలు నడిపే పరిస్థితికి వెళ్లింది. అన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు చేసింది. కాగా, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు జెట్ దాదాపు రూ.3,500 కోట్లు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications