అమెజాన్ మెల్లిగా రూపు మారుతోంది. కేవలం ఓ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫాంలా మిగిలిపోకుండా వివిధ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడంతో పాటు ఫుడ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. అమెజాన్ ఇండియాను దగ్గరగా పరిశీలిస్తున్న కొంత మంది ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. టెన్సెంట్‌కు చెందిన వి-చాట్ మాదిరి ఓ సూపర్ యాప్‌లా అమెజాన్ ఇండియాను రూపొందించాలనేది సంస్థ ప్రణాళిక.
సియాటిల్‌కు చెందిన అమెజాన్ ప్రస్తుతం ఫ్లైట్ బుకింగ్స్‌కు సంబంధించిన బీటా టెస్టింగ్ చేస్తోంది. ఇందుకోసం క్లియర్ ట్రిప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ-కామర్స్ నుంచి ఆల్ ఇన్ ఒన్ యాప్‌గా మారేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఫుడ్ ఆర్డర్స్, క్యాబ్ బుకింగ్, హోటల్ బుకింగ్ వంటివి కూడా యాప్‌లో మిళితం చేయాలని చూస్తోంది. అయితే అన్నీ తానే చేయకుండా ఈ సేవలను అందిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వీళ్ల వేదిక ద్వారా ఆ సేవలను పొందే విధంగా ప్లాన్ చేసుకుంటోంది. అవసరాన్ని బట్టి కొన్ని కంపెనీల ఏపీఐలను ఇంటిగ్రేట్ చేసుకోవడం, మరికొన్నింటిని తమ ప్లాట్‌ఫాంలోకి అనుమతించడం వంటి అంశాలను ప్రస్తుతం అమెజాన్ పరిశీలిస్తోంది.

జాప్టోను వాడుకోవచ్చు
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఓలా, పేటిఎం, ఫోన్ పే వంటి సంస్థలకు విపరీతమైన కన్స్యూమర్ బేస్ ఉంది. అందుకే ఈ సంస్థలన్నీ తమ వేదిక ద్వారా వివిధ సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్ దగ్గర 15 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల బేస్ ఉంది. కానీ నెలనెలా యాక్టివ్ కస్టమర్లు మాత్రం 2-2.5 కోట్ల మంది మాత్రమే ఉంటున్నారు. ఈ సంఖ్యను పెంచుకోవాలనేది ఇప్పుడు అమెజాన్ టార్గెట్. అమెజాన్ ఈ మధ్య టాప్జో అనే స్టార్టప్‌ను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్ ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వివిధ సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. దీంతో టాప్జోను వినియోగించుకుని ఈ తరహా సర్వీసెస్ ఆఫర్ చేయాలని అనుకుంటోంది అమెజాన్.
వి-చాట్ స్థాయికి ఎదగాలి
అమెజాన్‌కు కస్టమర్ బేస్ ఉన్నా.. వాళ్లను ఎక్కువగా ఎంగేజ్ చేయలేకపోతోంది. గ్రాసరీ, అమెజాన్ పే వంటివి ప్రవేశపెట్టినా బేస్ అనుకున్నంత రేంజ్‌లో పెరగడం లేదు. ఇది పెంచుకోవాలంటే కస్టమర్‌కు మరింత దగ్గరవడమే ఏకైక ఉపాయం. అందుకే ఈ మధ్య వివిధ ఆన్ లైన్ సంస్థలైన యాత్రా, రెడ్ బస్, అభిబస్ సంస్థలతో టై అప్ పెట్టుకుంది. అదే సమయంలో ఫుడ్ స్పేస్‌లో బాక్స్ 9, ఫసూస్, ఫ్రెష్ మెనూ, కఫీ డే తోనూ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ నేపధ్యంలో టెన్సెంట్ కంపెనీకి చెందిన విచాట్ స్థాయికి ఎదగాలనేది వీళ్ల టార్గెట్. ఎందుకంటే విచాట్‌కు ప్రతీ రోజూ 100 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉంటారు. ప్రపంచంలో ఏ యాప్‌కూ ఈ స్థాయిలో యాక్టివ్ యూజర్స్ బేస్ లేదు. అందుకే ఇండియాలో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టి మరింత దగ్గర కావాలనేది అమెజాన్ లక్ష్యం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్‌లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications