విదేశాల నుంచి మన దేశానికి డబ్బు పంపేవారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. 2018లో వివిధ దేశాల నుంచి భారత్‌కు 79 బిలియన్ డాలర్లు చేరినట్లు వరల్డ్ బ్యాంక్ నివేదిక తెలిపింది. భారత్ తర్వాత చైనా, మెక్సికో, పిలిప్పీన్స్, ఈజిప్ట్ దేశాలు ఉన్నాయి. విదేశాల నుంచి ఎక్కువ నిధులు వస్తుండటంతో డాలర్ల రూపంలో అత్యధిక సొమ్ము జమ అయిన దేశంగా భారత్ తొలి స్థానంలో ఉంది.
2018లో భారత్‌కు 79 బిలియన్ డాలర్లు రాగా, చైనాకు 67 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 36 బిలియన్ డాలర్లు, పిలిప్పీన్స్‌కు 34 బిలియన్ డాలర్లు, ఈజిప్ట్‌కు 29 బిలియన్ డాలర్ల సొమ్ము వచ్చింది. గత మూడేళ్లుగా డాలర్ల రూపంలో భారత్‌కు వచ్చే సొమ్ము క్రమంగా పెరుగుతోంది.

2016 సంవత్సరంలో 62.7 బిలియన్ డాలర్లు, 2017 65.3 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ 2018లో మాత్రం అనూహ్యంగా పెరిగింది. గత సంవత్సరం 79 బిలియన్ డాలర్లకు చేరుకుంది. విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య పద్నాలుగు శాతం పెరిగిందని, ముఖ్యంగా కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన తమ వారిని ఆదుకునేందుకు అనేక మంది పెద్ద మొత్తంలో సొమ్మును భారత్‌కు పంపారని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.
పాకిస్తాన్‌కు విదేశాల నుంచి వచ్చే నగదు 7 శాతంగా ఉంది. తక్కువ, మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాలకు 2017లో 483 బిలియన్ డాలర్లు రాగా, 2018లో 529 బిలియన్ డాలర్లు వచ్చాయి. అంతకుముందు ఏఢాది కంటే 9.6 శాతం వృద్ధి ఉంది. అత్యధిక ఆదాయం కలిగిన దేశాల్లో 2017లో 633 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2018లో 689 బిలియన్ డాలర్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications