ఎన్నికలవేళ రూ.8 కోట్లతో పట్టుబడిన బీజేపీ, తలెత్తుతున్న 10 ప్రశ్నలు

డిజిటల్ ఇండియా, డిజీ ధన్ మేళా.. నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటూ ప్రధాన మంత్రి మోడీ మూడేళ్లుగా ఊదరగొట్టి వదిలారు. అసలు నగదుకే ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇకపై భారత్ అంతా డిజిటల్ మయం కావాలంటూ ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టే పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు నానా ఆంక్షలు విధించారు మోడీ. అసలు బ్యాంకుల్లోనే నగదు లేకుండా చేసి సామాన్యులు చచ్చినట్టు డిజిటల్ వైపు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అయితే సదరు పార్టీ మాత్రం తెలంగాణ ఎన్నికల్లో రూ.8 కోట్ల హాట్ క్యాష్‌తో పట్టుబడింది. ఇది ఎవరికీ అంతుచిక్కని మిస్టరీగా మారింది. బిజెపి నేతలు చెబ్తున్న దానికీ వాస్తవానికీ ఏ మాత్రం పొంతన లేకపోవడంతో వీళ్లు కూడా అందరిలానే అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మేము ఏ మాత్రం తప్పుచేయలేదని, అదంతా అకౌంట్ నుంచి తీశాం కాబట్టి వైట్ మనీయే అని చెప్పి చేతులు దులుపుకుంటున్న నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా? 10 అనుమానాలు

 బీజేపీ లక్ష్మణ్

బీజేపీ లక్ష్మణ్

1. బిజెపి కరెంట్ అకౌంట్‌కు కోశాధికారిగా ఉన్న లక్ష్మణ్‌ రూ.8 కోట్లకు సెల్ఫ్ చెక్ ఇస్తే బ్యాంక్ అంత ఈజీగా నగదును ఎలా ఇచ్చేసింది ? ఎంతపెద్ద కార్పొరేట్ అకౌంట్ అయినా రూ.8 కోట్ల హాట్ క్యాష్‌ను బ్యాంక్ అధికారులు ఇలా ఇచ్చారు. అది కూడా సంతకం చేసిన ఖాతాదారు వ్యక్తిగత హాజరు లేకుండా అంత పెద్ద మొత్తం కేవలం ఓ ఆఫీస్ అసిస్టెంట్‌కు ఎలా ఇచ్చేశారు?

2. బిజెపి రాష్ట్ర శాఖ ఖాతాలో రూ.8 కోట్లు డ్రా చేసుకునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరెవరు పార్టీ ఫండ్ ఇచ్చారు ? ఆ డబ్బు తెలంగాణా రాష్ట్రం నుంచే సమీకరించారా లేక.. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిందా?

3. పార్టీ ప్రతినిధులు చెబ్తున్నట్టు చిన్న ఖర్చులకు రూ.8 కోట్లు అవసరమా ? షామ్యానాలు, టెంట్ హౌస్‌లు, పార్టీ మీటింగ్‌లకు అన్ని కోట్లు ఖర్చవుతాయా?

 జీఎస్టీ కట్టకుండా ఆ డబ్బు ఎలా ఇచ్చారు?

జీఎస్టీ కట్టకుండా ఆ డబ్బు ఎలా ఇచ్చారు?

4. పార్టీ అవసరాలకో, లేదా ఇతర ఖర్చులకే ఆ డబ్బు వినియోగించారని అనుకుందాం. జీఎస్టీ కట్టకుండా ఆ డబ్బును సర్వీస్ ప్రొవైడర్స్‌కు క్యాష్‌లోనే ఎందుకిచ్చారు ? ఒక వేళ బిల్స్ ఉంటే.. చెక్ రూపంలోనో లేక మనీ ట్రాన్స్‌ఫర్ చేసి ఉండొచ్చు కదా ? క్యాష్‌లో బిల్లులు చెల్లించడం వెనుక ఉద్దేశం ఏంటి ? అంత పెద్ద పార్టీకి సేవలు అందిస్తున్న వాళ్లు ఖచ్చితంగా పెద్ద కాంట్రాక్టర్లే అయి ఉంటారు. వాళ్లకు బ్యాంక్ అకౌంట్, జీఎస్టీ ఉండే ఉంటుంది.

5. ఎన్నికల సమయంలో ఇంత క్యాష్‌తో బయటకు వస్తే పోలీసులకో, ఐటీ అధికారులకో, ఎన్నికల అధికారులకో సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలియదా ? లేక ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే క్యాష్‌ను విడతల వారీగా తీసుకురావాలని చూశారా ? (మొదట రూ.2 కోట్లు కొంత మంది వ్యక్తులతో పంపారు, మిగిలిన రూ.6 కోట్ల మొత్తం బ్యాంక్ దగ్గర ఆఫీస్ అసిస్టెంట్ దగ్గర ఉంది).

6. బిజెపి స్టాండ్ అయిన నగదురహిత లావాదేవీలకు ఈ క్యాష్ సెటిల్మెంట్ వ్యతిరేకం కాదా?

7. ఇప్పుడున్న నగదు కొరత నేపధ్యంలో అంత పెద్ద నగదు మొత్తాన్ని బ్యాంకులు ఎలా ఇచ్చాయి ? వాస్తవానికి ఒక్కో పెద్ద ఏటీఎంలో రూ.50-60 లక్షల వరకూ క్యాష్ పెట్టొచ్చు, అలాంటివన్నీ కాదని ఇంత పెద్ద మొత్తాన్ని నగదు రూపంలో ఇవ్వడానికి బ్యాంక్ తన హెడాఫీస్ నుంచి అనుమతి తీసుకుందా?

ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తం ఇస్తున్నప్పుడు హాట్ క్యాష్

ఎన్నికల సమయంలో ఇంత పెద్ద మొత్తం ఇస్తున్నప్పుడు హాట్ క్యాష్

8. ఎన్నికల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇంత పెద్ద మొత్తం ఇస్తున్నప్పుడు బ్యాంక్ అధికారులు కనీసం ఒక్క మాటైనా అడ్డు చెప్పకుండా హాట్ క్యాష్ ఎలా ఇచ్చేస్తారు ? క్యాష్ ఇవ్వమని ఒత్తిడి తెచ్చారా.. లేక వాళ్ల ఇష్టానుసారం ఇచ్చేశారా. సాధారణంగా ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఆంధ్రా బ్యాంక్ వంటి స్థానిక బ్యాంకులకు కరెన్సీ ఛెస్ట్ అటాచ్ అయి ఉంటుంది. ఇండియన్ బ్యాంక్‌కు కరెన్సీ చెస్ట్ ఉండే అవకాశం లేదు. ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ కావాలంటే బిజెపి నేతలు కనీసం నాలుగైదు రోజులు ముందు చెప్పి ఉండాలి. అలాంటప్పుడు ఎన్నికల కమిషన్‌కు, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్‌కో, లీడ్ బ్యాంకర్‌కో ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు ముందస్తుగా చెప్పారా ?

9. ప్రతీ రోజూ ప్రతి బ్యాంక్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌ను స్థానిక రిటర్నింగ్ అధికారికి సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వాలి. రూ.10 లక్షలకు పైబడిన ప్రతీ లావాదేవీని రిపోర్ట్ చేయాలి. మరి ఈ సందర్భంలో ఇండియన్ బ్యాంక్ అధికారులు ముందస్తుగా ఎన్నికల అధికారులకు రూ.8 కోట్ల నగదు విషయాన్ని ఎందుకు చెప్పలేదు?

10. ఆడపిల్ల పెళ్లి లేదా ఏదైనా అత్యవసరమని బ్యాంక్ చుట్టూ తిరిగితే కనీసం రూ.2 లక్షలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు సిద్ధంగా లేవు. మరి అలాంటి స్థితిలో ఇన్ని కోట్ల హాట్ క్యాష్‌ను ఇండియన్ బ్యాంక్ నారాయణగూడ శాఖ ఎందుకు, ఎలా ఇచ్చింది ?

బ్యాంక్ నుంచి రూ.8 కోట్లను తీసుకున్నంత మాత్రాన లెక్కచెప్పాల్సిన అవసరం లేని సొమ్ముగా దాన్ని భావించలేం. ఎందుకు అంత మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకోవాల్సి వచ్చిందో బిజెపి వివరణ ఇవ్వాల్సి ఉంది. అటు బిజెపితో పాటు బ్యాంక్ అధికారులు కూడా దీనిపై ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది. అంత పెద్ద మొత్తాన్ని బిజెపి నాయకులు తీసుకెళ్తున్నప్పుడు పోలీసులకో, ఈసీకో ఎవరికైనా ముందస్తుగా చెప్పి ఉండాల్సింది. అలాంటిదేమీ లేకుండా బ్యాంక్ నుంచి తీసుకున్నాం కాబట్టి తప్పులేదు అనడంలో అర్థంలేదు.

బిజెపి ఇలా...

బ్యాంక్ ఖాతా నుంచే రూ.8 కోట్లు తీసుకున్నాం కాబట్టి ఇది బ్లాక్ మనీ కాదు. అంతా వైట్ మనీయే. కోశాధికారి సంతకంతో డబ్బును విత్ డ్రా చేసుకున్నాం కాబట్టి సమస్య లేదు.

కరెంట్ ఖాతా కాబట్టి ఎన్ని కోట్ల మొత్తాన్ని అయినా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది

ఇండియన్‌ బ్యాంక్‌తో ఎన్నో ఏళ్ల నుంచి ఖాతా నిర్వహిస్తున్నాం కాబట్టి వాళ్లు అంత పెద్ద మొత్తంలో క్యాష్ ఇచ్చారు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+