For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయుల సగటు జీవిత కాలం అంచనా: బంగ్లాదేశ్ కంటే తక్కువ, టాప్ 10 రాష్ట్రాలివే

|

రాష్ట్రాల స్టాటిస్టిక్స్‌తో కూడిన హ్యాండ్‌బుక్‌ను ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో ఆయా రాష్ట్రంలో సగటు జీవిత కాలం అంచనా ప్రస్తావన కూడా ఉంది. ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాలకు మధ్య ఆయురార్ధం విషయంలో ఎంతో తేడా ఉంది. ఇక భారత్ యావరేజ్ చూస్తే బంగ్లాదేశ్, కంబోడియా వంటి చిన్న దేశాల కంటే మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ తక్కువగా ఉంది. టాప్ టెన్ రాష్ట్రాలు ఇవే.

<strong>జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్.. ఎలా బుక్ చేయాలంటే: ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోండి</strong>జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్.. ఎలా బుక్ చేయాలంటే: ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసుకోండి

గుజరాత్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 69.5 ఏళ్లుగా ఉంది. పురుషులు 67.4 ఏళ్లు, మహిళలు 71.8 ఏళ్లు ఉంది. ఆంధ్రప్రదేశ్‍‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 69.6గా ఉంది. పురుషులు 68, మహిళలు 71.4గా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో 70.8గా ఉంది. పురుషులు 69.8, మహిళలు 71.9గా ఉంది. తమిళనాడులో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 71.4గా ఉంది. పురుషులు 68.5, మహిళలు 74.8గా ఉంది. ఉత్తరాఖండ్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 71.5గా ఉంది. ఇందులో పురుషులు 68.5, మహిళలు 74.8గా ఉంది.

Top 10 Indian states where the average life expectancy is highest

మహారాష్ట్రలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 72.2 ఏళ్లుగా ఉంది. పురుషులు 70.8, మహిళలు 73.7గా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 72.3 ఏళ్లుగా ఉంది. ఇందులో పురుషులు 69.4, మహిళలు 75.5గా ఉంది. పంజాబ్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 72.5గా ఉంది. పురుషులు 71 ఏళ్లు, మహిళలు 74.2 ఏళ్లుగా ఉంది. జమ్ము కాశ్మీర్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 73.5గా ఉంది. ఇందులో పురుషులు 71.6, మహిళలు 76.2గా ఉంది. కేరళలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 75.1గా ఉంది. పురుషుల జీవితకాలం 72.2గా, మహిళల జీవితకాలం 79.9గా ఉంది. భారతదేశంలో యావరేజ్‌గా 68.7 ఏళ్లుగా ఉంది. ఇందులో పురుషులు 67.4, మహిళలు 70.2గా ఉంది. ఇది 2012-16 డేటా.

English summary

భారతీయుల సగటు జీవిత కాలం అంచనా: బంగ్లాదేశ్ కంటే తక్కువ, టాప్ 10 రాష్ట్రాలివే | Top 10 Indian states where the average life expectancy is highest

RBI released its 2019 Handbook of Statistics on Indian States that includes data on life expectancy. It reveals a massive gap between the top states compared to the bottom ranks. The average life expectancy in India is far lower than countries such as Bangladesh and Cambodia. Read on to find which state tops the list.
Story first published: Monday, April 8, 2019, 12:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X