For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లను పడేసిన రిలయన్స్, ఫైనాన్స్ స్టాక్స్

By Chanakya
|

వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత రెండు వారాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు భారీగా పతనమైంది. అనూహ్యంగా మళ్లీ ఆఖర్లో కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిసింది. ఇంట్రాడేలో 11600 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నిఫ్టీ ఇన్వెస్టర్లలో టెన్షన్ పెంచింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కొండెక్కడం, రూపాయి పతనం ఈ రోజు సూచీల పతనానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

ఇంట్రాడేలో 11704 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ అప్పుడే 11710 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ చేరింది. మళ్లీ అక్కడి నుంచి ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. ఒక దశలో 11549 పాయింట్ల కనిష్టం వరకూ దిగొచ్చింది. గరిష్టం నుంచి 160 పాయింట్లు కోల్పోవడం టెన్షన్ పుట్టించింది. చివరకు అనూహ్యంగా కోలుకుంది. 60 పాయింట్ల వరకూ రికవర్ అయింది. ఫైనల్‌గా 61 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 11604 పాయింట్ల దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 162 పాయింట్లు కోల్పోయి 38700 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 240 పాయింట్లు కోల్పోయి 29845 దగ్గర క్లోజైంది.

Market closing: Indices end off days low with Nifty above 11,600, Sensex falls 162 points

ఒక్క ఐటీ మినహా అన్ని రంగాల షేర్లూ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా రియాల్టీ, మెటల్, మీడియా రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికమైంది.

మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టిసిఎస్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హోసింగ్ ఫైనాన్స్, ఇండియన్ఆయిల్, బజాజ్ ఫైనాన్స్, వేదాంతా, యెస్ బ్యాంక్ షేర్లు టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.

డీఎల్ఎఫ్ ఢమాల్

సింగపూర్ ప్రభుత్వ సంస్థ జిఐసి.. డిఎల్ఎఫ్‌లో తనకు ఉన్న వాటాను అమ్మేసిందనే వార్తలను స్టాక్‌ను పడదోశాయి. సుమారు 6.81 కోట్లు షేర్లు బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారడంతో డీఎల్ఎఫ్ స్టాక్ ఏకంగా 9 శాతం వరకూ పడిపోయింది. ఇరు సంస్థలూ కలిసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేద్దామనే ప్లాన్ ఉన్నప్పటికీ అది వర్కవుట్ కాలేదు. దీంతో జీఐసీ తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. చివరకు ఈ స్టాక్ 8.4 శాతం నష్టపోయి రూ.185 దగ్గర క్లోజైంది.

ఎన్ఐఐటిలో ఫుల్ స్వింగ్

ఎన్ఐఐటి లిమిటెడ్ దగ్గరున్న 30 ఎన్ఐఐటి టెక్ వాటాను కొనుగోలు చేసేందుకు బేరింగ్ ఈక్విటీ సంస్థ కొనుగోలు చేసింది. ఓపెన్ ఆఫర్ మరో 26 శాతం వాటాను కొనాలని కూడా నిర్ణయించింది. దీంతో ఎన్ఐఐటి టెక్ స్టాక్ 4 శాతం నష్టపోతే ఎన్ఐఐటి లిమిటెడ్ స్టాక్ ఏకంగా 20 శాతం లాభపడింది. చివరకు 19.6 శాతం లాభాలతో రూ.114 దగ్గర క్లోజైంది.

లక్ష్మీవిలాసం.. బుల్స్ విలాపం

ఇండియాబుల్స్ హోసింగ్ ఫైనాన్స్‌లో లక్ష్మీవిలాస్ బ్యాంక్ విలీన వార్తల నేపధ్యం లో ఈ రెండు స్టాక్స్‌లో అధిక యాక్టివిటీ నమోదైంది. ఈ ప్రక్రియకు తమ అనుమతి లేదని ఆర్బీఐ కూడా ప్రకటించింది. అయినప్పటికీ లక్ష్మీవిలాస్ బ్యాంక్ షేర్5 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. రూ.97.35 దగ్గర క్లోజైంది. ఇదే సమయంలో ఐబీ హౌసింగ్ మాత్రం 5 శాతం నష్టపోయి రూ.859 దగ్గర ముగిసింది.
ఈ డీల్ పూర్తయ్యేందుకు కనీసం 6 నెలల సమయం పడ్తుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చమురు మళ్లీ.. మళ్లీ..

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పతనబాటపడ్తున్నాయి. ఈ రోజు కూడా హెచ్ పి సి ఎల్, ఇండియన్ ఆయిల్ కంపెనీల షేర్లు 4 శాతం వరకూ నష్టపోయాయి.

చక్కెర చేదెక్కింది

కొంత కాలం నుంచి నిలకడగా ఉన్న చక్కెర రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగింది. బల్రాంపూర్ చీనీ, ధంపూర్ షుగర్స్ 8 శాతం నష్టపోయాయి. ఇదే బాటలో అవధ్ షుగర్స్, ఉత్తమ్ షుగర్స్, ద్వారికేష్ షుగర్స్, దాల్మియా షుగర్స్, శ్రీరేణుకా షుగర్స్ 5 శాతం వరకూ కోల్పోయాయి.

ఐటీ మళ్లీ ఫోకస్‌లోకి

రూపాయి మళ్లీ నీరసిస్తోంది. ఈ రోజు 43 పైసలు కోల్పోయి రూ.69.66 వరకూ పతనమైంది. దీంతో ఐటీ స్టాక్స్ మళ్లీ ఫోకస్ లోకి వచ్చాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో స్టాక్స్ ఒకటిన్నర శాతం వరకూ లాభపడ్డాయి.

English summary

మార్కెట్లను పడేసిన రిలయన్స్, ఫైనాన్స్ స్టాక్స్ | Market closing: Indices end off day's low with Nifty above 11,600, Sensex falls 162 points

The Sensex was down 162 points at 38700.53, while Nifty was down 61.50 points at 11604.50. About 1070 shares have advanced, 1493 shares declined, and 161 shares are unchanged.
Story first published: Monday, April 8, 2019, 17:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X