ఎంఐ ఫ్యాన్ ఫెస్టివెల్ సేల్: రూ.1కే ఫ్లాష్ సేల్, శనివారం దాకా ఫ్లాష్ సేల్
ఏప్రిల్ 4వ తేదీన గ్జియోమీ ఎంఐ ఫ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. తొలి రోజు ఫ్లాష్ సేల్‌లో రూ.1కే రెడ్‌మి నోట్ 7 ప్రో, ఎంఐ సౌండ్ బార్ విక్రయించింది. నేడు (ఏప్రిల్ 5) మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో పోకో ఎఫ్1, స్మార్ట్‌ఫోన్‌ను ఒక్క రూపాయికే కొనుగోలు చేయవచ్చు. మొత్తం 20 స్మార్ట్ ఫోన్లను కేవలం రూపాయికే విక్రయిస్తోంది. పోకో ఎఫ్1 రూ.20వేలుగా ఉంది.
పోకో ఎఫఅ1 స్మార్ట్ ఫోన్‌తో పాటు హోం సెక్యూరిటీ కెమెరా బేసిక్‌ను కూడా రూపాయికే అమ్మనుంది. 20 హోమ్ కెమెరా యూనిట్లు సేల్‌లో ఉన్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివెల్ ఉంది. ఈ మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, డీల్స్ ఉంటున్నాయి.

ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో కొన్ని ఉత్పత్తులను కేవలం ఒక్క రూపాయికే విక్రయిస్తోంది. వన్ రూపీ ఫ్లాష్ సేల్‌లో పాల్గొనాలంటే మధ్యాహ్నం రెండు గటంలకు ముందే ఎంఐ డాట్ కామ్ వెబ్ సైట్ ఓపెన్ చేసి లాగిన్ కావాలి. లేదా యాప్ డౌన్ లోడ్ చేసుకొని లాగిన్ కావాలి. ఫ్లాష్ సేల్‌లో తక్కువ ఫోన్లు ఉంటాయి. సెకనుల్లో ఇవి ముగిసిపోతాయి. రేపు కూడా ఫ్లాష్ సేల్ ఉండనుంది.
కాగా, గ్జియోమీ రెడ్‌మి నోట్ 7 ప్రో, రెడ్‌మి నోట్ 7, రెడ్‌మి జీవోలను కూడా ఈ రోజు మొదటిసారి విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications