For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచంలో అత్యధిక పన్ను విధించే దేశాల్లో భారత్: ట్రంప్ ఆగ్రహం

|

వాషింగ్టన్: ప్రపంచంలో అత్యధిక పన్నులు విధించే దేశాల్లో భారతదేశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. నేషనల్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ కమిటీ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడాడు. హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ వంటి కొన్ని రకాల వస్తువులపై వంద శాతం పన్నులు విధిస్తోందని అసహనం వ్యక్తం చేశాడు. ఇలా అత్యధిక పన్నులు విధించడం సరికాదని చెప్పాడు. భారత్ టారిఫ్ కింగ్ అని సెటైర్ వేశాడు.

<strong>ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా.. 5 ముఖ్యమైన ఛార్జీలు తెలుసుకోండి?</strong>ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా.. 5 ముఖ్యమైన ఛార్జీలు తెలుసుకోండి?

అమెరికా ఐటమ్స్‌పై పన్నులు అద్భుతంగా వసూలు చేస్తుందన్నాడు. భారత్ అత్యధిక పన్నులు విధించే దేశమని, అమెరికా ఐటమ్స్ పైన వంద శాతం పన్నులు విధిస్తారని, కానీ వారు మాత్రం ఇక్కడ మోటార్‌ సైకిళ్లను విక్రయించి బాగా సంపాదిస్తారని, హార్లీ డేవిడ్‌సన్‌ను పంపిస్తే మాత్రం వంద శాతం పన్ను వేస్తారని, ఇది బాగోలేదన్నారు.

India is one of the highest taxing nations in the world: Donald Trump

గతంలోను ఆయన ఇండియన్ ట్యాక్స్ పైన విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై వంద శాతం పన్నును విధిస్తోందన్నాడు. కానీ అమెరికా మాత్రం ఆ స్థాయిలో భారత్ ఉత్పత్తులపై పన్నులు విధించలేదని చెప్పాడు. భారత్ వెంటనే సుంకాలు తగ్గించాలని గతంలో అన్నాడు. లేదంటే అదే స్థాయిలో భారత ఉత్పత్తులపై సుంకాలు పెంచుతామని చెప్పాడు.

English summary

ప్రపంచంలో అత్యధిక పన్ను విధించే దేశాల్లో భారత్: ట్రంప్ ఆగ్రహం | India is one of the highest taxing nations in the world: Donald Trump

India is one of the highest taxing nations in the world, US President Donald Trump has alleged as he again slammed the country for imposing 100 per cent tariffs on American products, including the iconic Harley-Davidson motorcycles.
Story first published: Thursday, April 4, 2019, 14:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X