మోడీ నోట్లురద్దు చేసిన ఏడాది 88 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఆపేశారు, 2 కారణాలివే
న్యూఢిల్లీ: నోట్ల రద్దు ప్రకటించిన ఆర్థిక సంవత్సరంలో (2016-17) కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అయితే అదే సమయంలో రిటర్న్స్ స్టాప్ చేసిన వారి సంఖ్య కూడా బాగానే పెరిగిందట. ఇందుకు ఉద్యోగాలు పోవడం, ఆదాయం తగ్గడమే కారణాలుగా చెబుతున్నారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ ఏడాదికి గాను కొత్తగా 1.06 కోట్ల మంది ట్యాక్స్ ప్లేయర్లు చేరారు. అంతకుముందు ఏడాది కంటే పెరుగుదల దాదాపు 25 శాతం. 88.04 లక్షల మంది ఫైల్ దాఖలు చేయడం ఆపేశారట.

కొత్తగా ట్యాక్స్ ఫైల్ చేసిన వారు ఇలా
2016-17 ఏడాదిలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఆపిన వారు (స్టాప్ ఫైలర్స్) 88.04 లక్షల మంది. అంతకుముందు ఏడాది కంటే (2015-16) ఈ సంఖ్య పది రెట్లు ఎక్కువ. దాదాపు గత రెండు దశాబ్దాలలో అంటే 2000-01 నుంచి ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఆగిపోవడం నోట్ల రద్దు అయిన ఆర్థిక సంవత్సరమే అత్యధికం.
2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా కొత్తగా ట్యాక్స్ ఫైల్ చేస్తున్న వారు ఇలా ఉన్నారు. 2012-13లో 52.39 లక్షల మంది, 2013-14లో 55.25 లక్షల మంది, 2014-15లో 66.27 లక్షల మంది, 2015-16లో 85.75 లక్షల మంది, 2016-17లో 106.25 లక్షల మంది కొత్తగా ట్యాక్స్ ఫైల్ చేశారు.

ఐటీ రిటర్న్స్ స్టాఫ్ ఫైలర్స్
అదే సమయంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఆపిన వారిని చూస్తే 2012-13 ఆర్థిక సంవత్సరంలో 37.54 లక్షల మంది, 2013-14లో 27.08 లక్షల మంది, 2014-15లో 16.32 లక్షల మంది, 2015-16లో 8.56 లక్షల మంది ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ఆపేశారు. కానీ 2016-17లో అంతకుముందు ఏడాది కంటే (2015-16లో 8.56 లక్షల మంది) పదింతలు అంటే 88.04 లక్ష మంది ఫైల్ రిటర్స్ దాఖలు చేయడం ఆపేశారు.

స్టాఫ్ ఫైలర్స్ అంటే?
స్టాఫ్ ఫైలర్స్ అంటే... ఇదివరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫైల్ చేయని ఇండివిడ్యూయల్స్‌ని స్టాఫ్ ఫైలర్స్ అంటారు. రిటర్న్స్ ఫైల్ ఆపేయడానికి పలు కారణాలు ఉంటాయి. అందులో ఉద్యోగం లేకపోవడం లేదా పోవడం, ఆదాయం తగ్గడం వంటి కారణాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications