భారత్‌లో తొలి ఇంటర్నెట్ కారు, దీని ప్రత్యేకతలు ఎన్నో.. కేవలం నోటి మాటతో ఇలా...
ఎంజీ మోటార్స్ భారత్‌లో తన తొలి ఇంటర్నెట్ కారును ప్రదర్శించింది. దీని పేరు హెక్టర్ (ఎస్‌యూవీ కారు). ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేశీయ వాహన పరిశ్రమలో ఇంతకుముందులేని ఎన్నో ఫీచర్లు ఇందులో చూడవచ్చు. మంగళవారం రోజు ఈ కారుకు సంబంధించిన ఫీచర్లను సంస్థ వెల్లడించింది. దీనిని మే చివరి నాటికి మార్కెట్లోకి తీసుకు రానున్నట్లు తెలిపింది.
5జీ సిమ్, బటన్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్‌తో మన దేశంలో కారు రావడం ఇదే తొలిసారి. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఇందులో స్మార్ట్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. హెక్టర్‌లో అతి ముఖ్యమైన ఫీచర్ ఐస్మార్ట్. దీంతో కారును మొత్తం కంట్రోల్ చేయవచ్చు. 5జీని సపోర్ట్ చేయనుంది. ఇది ఎమర్జెన్సీ కాల్స్, వెహికిల్ స్టేటస్, సన్‌రూఫ్ క్లోజ్, డోర్ లాక్ ఇలా చాలా పనులు చేయనుంది.

ఈ కారులో బటన్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. హలో ఎంజీ అని కారు రూప్, తలుపులు తెరవమని చెప్పవచ్చు. ఏసీని పెంచడం, తగ్గించడం వంటి సౌకర్యాలు కేవలం మాట మాత్రంగా చెప్పి పొందవచ్చు. మాటలతో డోర్ కూడా తెరవచ్చు. తక్కువ నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లోను ఇది పని చేయనుంది. ఈ కారులో ఉన్న ఇన్‌బిల్ట్ 5జీ స్మార్ట్ సిమ్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్‌తో దీనికి అనుసంధానం చేయవచ్చు.
ఇక, ప్రమాదానికి గురైనప్పుడు ఇందులో ఉన్న ఈ-కాల్ ఎమర్జెన్సీ వ్యవస్థ ద్వారా కస్టమర్ కేర్‌కు తెలిసేలా ఏర్పాటు ఉంది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోగానే సంస్థ పల్స్ హబ్‌కు మెసేజ్ వెళ్తుంది. రిజిస్టర్డ్ ఎమర్జెన్సీ నెంబర్‌కు కూడా సందేశం పోతుంది. కారులో లేకపోయినా సన్ రూఫ్ ఓపెన్ చేయడం లేదా డోర్ లాక్ చేయడం వంటివి చేయవచ్చు.
ఈ కారును రూపొందించేందుకు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, అడోబ్, సాఫ్‌లతో ఎంజీ మోటార్ జత కట్టింది. దేశీయ మార్కెట్లో లభించబోయే తొలి ఇంటర్నెట్ కారు ఇదేనని చెబుతున్నారు. రానున్న రెండేళ్లలో నాలుగు కొత్త కార్లతో పాటు హైబ్రిడ్, విద్యుత్‌తో నడిచే వాహనాన్ని కూడా విడుదల చేయనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా తెలిపారు.


Click it and Unblock the Notifications