చేదవార్త! ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో దాదాపు 31 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముంది. దాదాపు 54 వేలమంది ఉద్యోగులను తొలగించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోందట. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వేలాది మందిని ఉద్యోగం నుంచి తొలగించాలన్న ప్రతిపాదనకు అంగీకారం వచ్చిందట.
ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బోర్డు నిరీక్షిస్తోందట. ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ సూచించిన పది సూచనల్లో మూడింటిని గత మార్చి నెలలో బీఎస్ఎన్ఎల్ బోర్డు అప్రూవ్ చేసిందట.

అయితే డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) మాత్రం ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సూచనను పక్కన పెట్టాలని భావిస్తోందట.
వీఆర్ఎస్ కోరడం, ఉద్యోగులను తొలగించడం లేదా టెలికం కంపెనీకి చెందిన బిజినెస్‌ను మూసివేయడం వంటివి చేస్తే ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని, తద్వారా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని, అందుకే డీవోటీ వేచి చూడాలని నిర్ణయించుకుందని చెబుతున్నారని వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా, కమిటీ ఇచ్చిన సూచనల్లో కొన్నింటిని బీఎస్ఎన్ఎల్ బోర్డు అంగీకరించింది. రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించడం, 50 ఏళ్లకు పైబడిన వారికి వీఆర్ఎస్, 4జీ స్పెక్ట్రం కేటాయింపులు బీఎస్ఎన్ఎల్‌కు వచ్చేలా చేయడం వంటి సూచనలు చేసింది.
అయితే బీఎస్ఎన్‌ఎల్‌లో ఉద్యోగాలు తొలగించడం అంటే ట్విస్ట్ ఉంది. 50 ఏళ్ల పైబడిన వారి వీర్ఎస్ కోరడం, రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 58 ఏళ్లకు తగ్గించడం ద్వారా దాదాపు 54,451 మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోవచ్చునని అంటున్నారు. బీఎస్ఎన్ఎల్‌లో 1,74,312 మంది ఉద్యోగులు ఉన్నారు. 54 వేల మంది అంటే ఇది 31 శాతం.
కేవలం రిటైర్మెంట్ ఏజ్ తగ్గించడం వల్లనే రానున్న ఆరేళ్లలో 13,895 కోట్లను సేవ్ చేసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ తగ్గిస్తే 33వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగుల యావరేజ్ వయస్సు 55. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు తమ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications