గుడ్ న్యూస్! పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్ లింక్ చేసుకోని వారికి సంతోషకరమైన వార్త. పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ మేరకు ఆదివారం మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పాన్ - ఆధార్ లింక్ తప్పనిసరి అని గతంలోనే ఆదేశించింది. అప్పటి నుంచి ఈ గడువును ఆరుసార్లు పెంచింది. ఇప్పుడు ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది.
తాజాగా, మరో ఆరు నెలలు పొడిగిస్తూ 30 సెప్టెంబర్ 2019 నాటికి అవకాశం ఇచ్చింది. ఆధార్‌తో అనుసంధానం లేకుంటే పాన్‌కార్డులు చెల్లుబాటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది. దీనిని పరిగణలోకి తీసుకొని గడువు పొడిగించింది. పాన్ - ఆధార్ లింకింగ్‌ను ఆదాయపన్ను శాఖ ఇప్పటికే తప్పనిసరి చేసింది. 2019-20 సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలంటే పాన్- ఆధార్ లింక్ తప్పనిసరి. నాలుగు విధానాల్లో ఆధార్ - పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు.

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి లింక్ తప్పనిసరి
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి ఆధార్ - పాన్ కార్డ్ లింకింగ్ తప్పనిసరి సుప్రీం కోర్టు గత ఏడాది సెప్టెంబర్ నెలలో చెప్పింది. అదే సమయంలో బ్యాంకు అకౌంట్లకు, మొబైల్ కనెక్షన్స్‌కు తప్పనిసరి కాదని చెప్పింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆధార్ కార్డు తప్పనిసరి అని అడగవద్దని చెప్పింది. ఐటీ ఫైల్ చేసే వారు మాత్రం లింక్ చేసుకోవాలి. గత ఏడాది సెప్టెంబర్ నెల వరకు 41 కోట్ల పాన్ కార్డులు జారీ చేస్తే, అప్పటికి 21 కోట్ల మంది తమ పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేసుకున్నారు. పాన్ - ఆధార్ లింకింగ్‌కు గతంలో 2017లో జూలై 31, ఆగస్ట్ 31, డిసెంబర్ 31లను, ఆ తర్వాత 2018లో మార్చి 31, జూన్ 30లను, అనంతరం 2019లో మార్చి 31ని డెడ్ లైన్ పెట్టారు. ఇప్పుడు మరోసారి సెప్టెంబర్ 30వ తేదీకి (2019) పొడిగించారు.

ఇన్‌కం ట్యాక్స్ వెబ్‌సైట్లోకి వెళ్లి లేదా ఎస్సెమ్మెస్ ద్వారా లింక్
పాన్ - ఆధార్ లింకింగ్ చాలా సులభం. http://www.incometaxindiaefiling.gov.in/home వెబ్ సైట్‌లో వెళ్లి ఆధార్ లింక్ విభాగంలో ఇది ఉంటుంది. ఎడమ వైపున 'Link Aadhaar' అని ఉంటుంది. అక్కడ పాన్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు ప్రకారం పేరు, ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ తదితర వివరాలు ఇచ్చిన తర్వాత కాప్చా కోడ్ టైప్ చేయాలి. విజువల్లీ ఛాలెంజ్‌డ్ యూజర్స్‌కు ఓటీపీని అందుబాటులో ఉంచారు. చివరలో 'Link Aadhaar' పైన క్లిక్ చేయండి.
మీరు ఎస్సెమ్మెస్ రూపంలో కూడా ఆధార్ - పాన్ లింక్ చేసుకోవచ్చు. - UIDPAN <12 డిజిట్ ఆధార్ నెంబర్ ><10 డిజిట్ పాన్ నెంబర్> మెసేజ్ టైప్ చేసి 567678 లేదా 56161కు ఆ సందేశాన్ని పంపించాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా పంపించాలి.

ఈ సమయాల్లోను అనుసంధానం కోరవచ్చు
ఆన్‌లైన్‌లో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో కూడా ఆధార్ సంఖ్యను పాన్ సంఖ్యతో అనుసంధానం కోరవచ్చు. ఎన్ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ వెబ్ సైట్లలో లభిస్తుంది. పాన్ కార్డు దరఖాస్తు సమయంలో కానీ పాన్ కార్డులో మార్పులకు దరఖాస్తు చేసే సమయంలో కానీ మనం ఆధార్ అనుసంధానం కోరవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications