న్యూఢిల్లీ: ఈ రోజుతో పాన్ కార్డ్ - ఆధార్ లింకింగ్, ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వంటి పలు అంశాలను పూర్తి చేసుకోవాల్సి ఉంది. వీటికి డెడ్ లైన్ ఈ రోజే (మార్చి 31). ఇప్పటి వరకు మీరు మీ పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే వెంటనే చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదని చెబుతున్నారు. లింక్ చేయకుంటే ఏమవుతుందో క్లారిటీ లేదంటున్నారు.
పాన్-ఆధార్ లింక్ గడువు నేటితో ముగియనుంది
ఆదాయపన్ను శాఖ ప్రకారం ఇది తప్పనిసరి. 2019-20 ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇది అవసరం. ఆధార్ - పాన్ లింకింగ్ కోసం ఐటీ డిపార్టుమెంట్ ఐదుసార్లు పొడిగించింది. కాగా, మీరు ఆధార్ - పాన్ లింక్ చేసుకోవడం చాలా సులభం.

- ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
- ఆధార్ లింకింగ్‌కు వెళ్లండి. ఆ వెంటనే మరో విండో ఓపెన్ అవుతుంది. ఆధార్ - పాన్ లింకింగ్ కోసం వివరాలు అడుగుతుంది.
- మీ పేరు, పుట్టిన తేది, జెండర్, ఆధార్ కార్డు వివరాలు అడుగుతుంది.
- ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. కప్చా కోడ్ అడుగుతుంది.
- ఆ తర్వాత లింక్ ఆధార్ పైన క్లిక్ చేయండి.
- ఆధార్ - పాన్ లింక్ తర్వాత మీకు సందేశం వస్తుంది.
మీరు ఎస్సెమ్మెస్‌తో కూడా ఆధార్ - పాన్ లింక్ చేసుకోవచ్చు.
- UIDPAN మెసేజ్ టైప్ చేసి 567678 లేదా 56161కు ఆ సందేశాన్ని పంపించాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా పంపించాలి.
- ఈ ప్రాసెస్ కంప్లీట్ కావడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
- ఆ తర్వాత మీరు ఇన్‌కం ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్, www.incometaxindiaefiling.gov.inలో చెక్ చేసుకోవచ్చు.
ఐటీ రిటర్న్స్
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఈ రోజే లాస్ట్. రిటర్న్స్ ఫైల్ చేయకుంటే మీరు నష్టపోయే అవకాశముంది. 2018-19 అసెస్‌మెంట్ రిటర్న్స్ కూడా ఇఫ్పుడు ఫైల్ చేయవచ్చు.
డీటీహెచ్, కేబుల్ టీవీలకు కూడా చానల్ సెలక్టర్ అప్లికేషన్‌కు డెడ్‌లైన్ ఈ రోజుతోనే ముగియనుంది. అయితే ఎన్‌రోల్ కాకుంటే ఏం యాక్షన్ తీసుకుంటారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.


Click it and Unblock the Notifications