నేటితో (మార్చి 31) 2018-19 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇయర్ ఎండ్ కలెక్షన్స్‌లో సహకరించేందుకు గాను ఆదాయపన్ను శాఖ, జీఎస్టీ కార్యాలయాలు శనివారం, ఆదివారం తెరిచే ఉంచారు. పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని పూర్తి చేసే నిమిత్తం సెలవు దినమైన ఆదివారం కూడా ఈ కార్యాలయాలు తెరుస్తున్నారు. శనివారం కూడా తెరిచారు.
పన్నులు చెల్లించేందుకు వీలుగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ ఆర్థిక సంవత్సరం చివరి వారాంతంలో (మార్చి 30, 31 తేదీల్లో) కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు (సీబీఐసీ) సంబంధించి అన్ని కార్యాలయాలు తెరిచే ఉంటాయని సీబీఐసీ అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది. పన్ను చెల్లింపుదార్లు రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమస్యలు ఉండకుండా చివరి రెండు రోజుల్లో అవసరమైనచోట్ల అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సీబీడీటీ తన కార్యాలయాలకు సూచించింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఆలస్యం చేసిన లేదా సవరించిన రిటర్న్స్ దాఖలుకు చివరి తేదీ మార్చి 31. ఆర్థిక సంవత్సరం ఆఖరి రెండ్రోజులు శని, ఆదివారాల్లో వచ్చాయి. దీంతో ఆదాయపు పన్ను విభాగ కార్యాలయాలు అన్నిసాధారణ పనివేళల ప్రకారం కార్యకలాపాలు నిర్వహిస్తాయని సీబీడీటీ తెలిపింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications