బీఎండబ్ల్యూ సరికొత్త 530ఐ-ఎం స్పోర్ట్స్ కారును భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ఖరీదు రూ.59.20 లక్షలు (ఎక్స్ షోరూం). ఎం స్పోర్ట్స్ ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి. ఈ సరికొత్త బీఎండబ్ల్యూ 530ఐని చెన్నై బీఎండబ్ల్యూ ప్లాంట్‌లో తయారు చేశారు. బీఎస్ VI ప్రమాణాలకు అనుగుణంగా పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించారు.

6.2 సెకండ్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది
2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు 252 హెచ్‌పీ (హార్స్ పవర్) సామర్థ్యంతో నడుస్తుంది. ఈ కారు కేవలం 6.2 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలో మీటర్ల వేగం అందుకుంటుంది. ఇప్పటికే ఈ మోడల్‌లో డీజిల్ ఇంజిన్ కార్లను మన దేశంలో ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డీఎస్సీ), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డీటీసీ), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ), గెస్చర్-కంట్రోల్, డిస్‌ప్లే కీ తదితర ఆధునిక భద్రతా ప్రమాణాలు దీని ప్రత్యేకత.

కారు చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు
ఈ సరికొత్త బీఎండబ్ల్యూఐ-ఎం స్పోర్ట్స్ కారు ఆల్పైన్ వైట్(నాన్ మెటల్లిక్)లో అందుబాటులో ఉంది. అలాగే, మెటల్లిక్ పేయింట్ వర్క్స్.. బ్లాక్ సఫైర్, మెడిటర్రనీన్ బ్లూ, బ్లూస్టోన్ మెటల్లిక్ మెయల్లిక్ పేయింట్ వర్క్స్‌లలో అందుబాటులో ఉంది. టెక్నాలజీపరంగా ఆధునీకరించిన ఈ కారు చుట్టు ఏం జరుగుతుందో అందులో ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ప్రసారం అవుతుంది. డ్రైవర్‌కు 24 గంటలు కూడా ఈ కారు గురించి తెలుసుకునే వెసులుబాటు ఉంది.

పార్కింగ్ ఎంతో సులువు
స్మార్ట్ ఫోన్ యూజర్‌కు వైర్ లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. సరౌండ్ వ్యూ కెమెరాలు, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్‌ల వంటి పార్కింగ్ అసిస్టెంట్ హెల్ప్‌తో పార్కింగ్ కూడా సులభంగా చేసుకోవచ్చు. బీఎండబ్ల్యు డిస్‌ప్లే కీ సహాయంతో డ్రైవర్ కారు బయట ఉండే.... తక్కువ పరిధి గల పార్కింగ్‌లలో తమ కారును పార్కింగ్ చేయవచ్చు. కంఫోర్ట్ యాక్సిస్ సిస్టం కీ లేకుండా ఓపెనింగ్, లాకింగ్‌కు అనుమతి ఇస్తుంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications