సంక్షోభంలో వెనిజులా: ఆయిల్ కోసం బ్రెజిల్, మెక్సికోలపై భారత్ దృష్టి
భారతదేశానికి ఆయిల్ సరఫరా దేశాల్లో సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్‌ల తర్వాత నాలుగో స్థానంలో వెనిజులా ఉంది. అయితే, ప్రస్తుతం వెనిజులా సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. బ్రెజిల్, మెక్సికో దేశాల నుంచి ఆయిల్‌ను తెప్పించుకొని నష్టాన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. 2017-18 ఏడాదికి గాను వెనిజులా 11 శాతం ఆయిల్‌ను సప్లై చేసింది. దాదాపు 18 మిలియన్ టన్నుల ఆయిల్ సరఫరా చేసింది. కానీ అమెరికాతో వివాదం నేపథ్యంలో ప్రస్తుతం వెనిజులా నుంచి ఆయిల్ వచ్చే పరిస్థితి ఆందోళనలో పడింది.
ఈ నేపథ్యంలో భారత్ మెక్సికో, బ్రెజిల్ వైపు చూస్తోంది. ఈ రెండు దేశాలు కూడా ఎనర్జీ సెక్టార్‌లో భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాయి. ఇంధన సహకారానికి సిద్ధమని తెలిపాయి. ఈ రెండు దేశాలతోను భారత్‌కు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా ఆయిల్ ఉత్పత్తి చేస్తాయి.

ప్రపంచంలోనే ఆయిల్ ఉత్పత్తిలో బ్రెజిల్ పదో స్థానంలో ఉంది. 150 మిలియన్ టన్నులకు పైగా క్రూడాయిల్‌ను తీస్తోంది. 110 మిలియన్ టన్నులతో మెక్సికో 11వ స్థానంలో ఉంది. వెనిజులాలోని పరిస్థితుల వల్ల ప్రత్యామ్నాయంగా బ్రెజిల్, మెక్సికోల నుంచి ఆయిల్ సరఫరా చేసుకోవచ్చునని, కానీ ఆయిల్ క్వాలిటీ, సరఫరా నిబంధనలు అనంతరమే తుది నిర్ణయానికి వస్తారని అధికారులు చెబుతున్నారు.
బ్రెజిల్, మెక్సికోల నుంచి కూడా భారత్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. కానీ 2013 నుంచి క్రమంగా దిగుమతి పరిమితి తగ్గుతూ వస్తోంది. 2013లో భారత్ 3.50 బిలియన్ డాలర్ల ఆయిల్‌ను మెక్సికో నుంచి, 1.78 బిలియన్ డాలర్లు బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ఇది.. మెక్సికో నుంచి 1.38 బిలియన్ డాలర్లు, మెక్సికో నుంచి 0.81 బిలియన్ డాలర్లకు తగ్గింది.
భారత్ 2017-18 ఏఢాదిలో 155 మిలియన్ టన్నుల ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతి రానున్న రోజుల్లో 170 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భారత్‌కు ఆయిల్‌ను ఎక్కువగా సరఫరా చేసే దేశాల్లో తొలుత సౌదీ అరేబియా, ఆ తర్వాత ఇరాక్, ఇరాన్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications