ఇక నుంచి బంగారం కొనాలనుకుంటే మీరు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు! ప్రముఖ డిజిటల్ పేమెంట్ 'గూగుల్ పే' ద్వారా కూడా మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఎక్కడైన డబ్బులు చెల్లించాలంటే ఇప్పుడు చాలామంది పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌లు వినియోగిస్తున్నారు.
ఫోన్ పే, పేటీఎంల వలె గూగుల్ పే బంగారం కొనుగోళ్లకు సరికొత్త సర్వీసును త్వరలో లాంచ్ చేయబోతుంది. దీని ద్వారా 99.99% స్వచ్ఛత కలిగిన 24 కేరట్ల బంగారం కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పే ద్వారా కూడా మనం బంగారం కొనుగోలు చేస్తే నేరుగా ఇంటికి వస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్ ఫాం ద్వారా మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

బంగారం: ఏం చేయాలి?
బంగారం కొనుగోలు, అమ్మకం కోసం గూగుల్ పే 'గోల్డ్ అకౌంట్'ను తీసుకు రానుంది. ఇందులోని గోల్డ్ అకౌంట్‌కు సబ్ స్క్రైబ్ కావాలి. ఇది గోల్డుతో లింక్ అయ్యే సేవింగ్స్ స్కీం. ప్రస్తుత మార్కెట్ ప్రకారం బంగాన్ని కొనుక్కోవడంతో పాటు దానిని వర్చువల్‌గా అట్టిపెట్టుకొని అవసరమైనప్పుడు గోల్డ్ కాయిన్లుగా లేదా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పేలు ఇలాంటి సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సర్వీసులు ఎంఎంటీసీ సారథ్యంలో నడుస్తాయి. ఈ సర్వీసులు లాంచ్ చేసేందుకు గోల్డ్ రిఫైనరీ ఎంఎంటీసీ - పీఏఎంపీతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గోల్డ్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యూజర్లు కేవైసీ నిబంధనలు పూర్తి చేయాలి. మీ వ్యాలెట్ నుంచి మీరు మీ అన్ని లావాదేవీలను చూసుకోవచ్చు.

ఆ ధర 5 నిమిషాలు లాక్ చేయబడుతుంది
గూగుల్ పే సాయంతో మీరు ఎంఎంటీసీ - పీఏఎంపీ ఇండియా ప్రయివేట్ లిమిటెండ్ నుంచి డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవచ్చు. గూగుల్ పేలో ప్రస్తుత మార్కెట్ బంగారం కొనుగోలు ధరను, పన్నుతో కలిపి చూపిస్తుంది. అక్కడ చూపించే ధర మీరు కొనుగోలు ప్రారంభించిన తర్వాత 5 నిమిషాల వరకు ఆ ధర లాక్ చేయబడుతుంది. ఎందుకంటే బంగారం ధరలు మారిపోతుంటాయి. ప్రాంతాలను బట్టి పన్నులు వివిధ రకాలుగా ఉండవచ్చు.

ఫోన్ నెంబర్ మార్చితే ఏం చేయాలి?
మీ వాలెట్ మీ సిమ్ కార్డుతో, పోన్ నెంబర్‌తో లింక్ చేయబడి ఉంటుంది. మీరు సిమ్ లేదా ఫోన్ నెంబర్ మార్చినప్పుడు మీ ఖాతాకు యాక్సెస్‌ను పునరుద్ధరించేందుకు మీ గుర్తింపును ధృవీకరించవలసి ఉంటుంది. సేవా నిబంధనలు లేదా వినియోగదారుల విధానాలు ఉల్లంఘిస్తే మీ ఖాతా యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు. నిర్ణీత అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే గూగుల్ పే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని సైనౌట్ చేస్తుంది. సిమ్ లేదా ఫోన్ నెంబర్ మార్చి ఉంటే మీ గోల్డ్ వాలెట్ వాలెట్‌ను తాత్కాలికంగా లాక్ చేయడం ద్వారా బంగారాన్ని భద్రంగా ఉంచుంది. గూగుల్ పే యాక్సెస్‌లో మార్పును నిర్ధారించే స్క్రీన్ కనిపిస్తుంది. అందులో 'కంటిన్యూ'ను ప్రెస్ చేయాలి. ఓపెన్ చేస్తే గూగుల్ ఫారం సర్వే వస్తుంది. దానిని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ యాక్సెస్‌ను నిర్ధారించుకొని మీ ఫోన్ నెంబర్‌ను అప్ డేట్ చేస్తుంది. ఈ అప్ డేట్ పూర్తయ్యేందుకు రెండ్రోజులు పట్టవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications