ఆర్థిక కష్టాల్లో పాకిస్తాన్, చైనా 2.1 బిలియన్ డాలర్ల లోన్: లాభం ఎవరికంటే?

ఇస్లామాబాద్: పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఈ వారం 8.81 శాతానికి పెరిగాయి. ఆ దేశ ఫారెక్స్ నిల్వలు 7 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోవడంతో ఇటీవలే ఆ దేశం పెరిగిపోతున్న అఫ్పులు చెల్లించలేక ఆస్తులను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌ను గట్టెక్కించేందుకు మిత్ర దేశాలు చైనా, సౌదీ అరేబియా, యూఏఈలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

పాకిస్తాన్‌ను ఆదుకున్న ఆ ముగ్గురు

పాకిస్తాన్‌ను ఆదుకున్న ఆ ముగ్గురు

అప్పులు ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్.. ఈ వారం ఆ దేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టింది. అయితే యూఏఈ ఆదుకున్నది. ప్లేస్ ఫండ్స్‌ పేరుతో బిలియన్‌ డాలర్లను పాకిస్తాన్‌కు అందించింది. వచ్చే నిధుల్లో కొంత అప్పులకు పోగా 716 మిలియన్‌ డాలర్లు పాకిస్తాన్ స్టేట్‌ బ్యాంక్‌ ఖాతాలో ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా, సౌదీ అరేబియా, యూఏఈల్లో పర్యటించి నిధుల కోసం ప్రయత్నాలు చేశారు. ఈ మూడు దేశాలు 14 బిలియన్‌ డాలర్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. గత ఏడాది నవంబర్ నెలలో చైనీస్ ప్రీమియర్ లి కెఖియాంగ్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లు బీజింగ్‌లో భేటీ అయ్యారు.

చైనా నుంచి 2.1 బిలియన్ డాలర్లు

చైనా నుంచి 2.1 బిలియన్ డాలర్లు

ఈ మేరకు పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్ట్రీ శుక్రవారం చైనా నుంచి వచ్చే లోన్ నిధుల గురించి వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. సోమవారం (మార్చి 25) నాటికి చైనా నుంచి 2.1 బిలియన్ డాలర్లు వస్తాయని తెలిపింది. పాకిస్తాన్ మినిస్ట్రీ అడ్వయిజర్ అండ్ స్పోక్స్ పర్సన్ ఖకాన్ నజీబ్ ఖాన్ మాట్లాడుతూ... చైనా ప్రభుత్వం నుంచి తమ దేశానికి 2.1 బిలియన్ డాలర్లకు (15 బిలియన్ యాన్లు) సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని తెలిపారు. మార్చి 25వ తేదీ నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్‌లో డిపాజిట్ అవుతాయని చెప్పారు. ఇలాగే ఉంటే వచ్చే అయిదేళ్లలో చైనాకు పాక్ చెల్లించాల్సిన మొత్తం 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో సీపెక్ (చైనా పాక్ ఎకనామిక్ కారిడార్)కు చెందిన ప్రాజెక్టులకు ఇచ్చినవి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల చైనాకే ఎక్కువ ప్రయోజనమని చెబుతున్నారు. కానీ దాని వడ్డీ భారం మాత్రం పాక్ పైన పడుతుందని అంటున్నారు.

నిరుపయోగ ఆస్తులు అమ్మకానికి

నిరుపయోగ ఆస్తులు అమ్మకానికి

పాకిస్థాన్‌ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జనవరిలో దాదాపు 6.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇది ఆ దేశ ఆరు వారాల దిగుమతి ఖర్చులకు సమానం. అప్పటికే దాదాపు 9.6 బిలియన్‌ డాలర్ల రుణం ఉంది. ఇందులో 7.27 బిలియన్‌ డాలర్లు అసలు కాగా, 1.787 బిలియన్‌ డాలర్లు వడ్డీ. మరోవైపు, ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ కూడా పాకిస్తాన్ విదేశాల నుంచి తెచ్చిన అప్పులు చెల్లించే పరిస్థితిలో లేదని, అలాగే ఆ దేశానికి నిధుల అవసరం పెరిగిందని పేర్కొంది. వచ్చే ఏడాదికి పాకిస్తాన్‌కు అవసరమైన అప్పు కంటే ఆ దేశం వద్ద ఉండే విదేశీ మారక ద్రవ్యం తక్కువ ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన నిరుపయోగ ఆస్తులను అమ్మకానికి పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+