న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతోంది. భారత ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్భణంకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. పప్పు ధాన్యాల ధరలు తగ్గడంతో పాటు పండ్లు, కూరగాయల ధరలు కాస్త తగ్గింది. అయితే ఆయిల్ ధరలు మాత్రం తగ్గలేదు. ఇక్కడ ఫిబ్రవరి 2018, ఫిబ్రవరి 2019కి సంబంధించిన డేటా వివరాలు ఉన్నాయి.
2018తో పోలిస్తే 2019లో రెండు మూడు మినహా మిగతా నిత్యావసర ధరల్లో పెరుగుదల ఎక్కువగా లేదు. ఫుడ్ అండ్ బీవరేజెస్ అయితే గత ఏడాది కంటే తగ్గడం గమనార్హం. 2018లో ఫుడ్ అండ్ బీవరెజెస్ 3.38 శాతం ఉండగా, ఈసారి మైనస్ 0.07గా ఉంది. అంటే వీటి ధరలు గతంలో కంటే తగ్గాయి.
నిత్యావసర వస్తువులు గత ఏడాది ఫిబ్రవరిలో 2.1గా ఉండగా, ఈసారి 1.32 గా ఉంది. మాంసం, చేపల వంటి ధరలు మాత్రం పెరిగాయి. 2018లో 3.31గా ఉండగా, ఇప్పుడు 5.92గా ఉంది. కోడిగుడ్లు 8.51గా ఉండగా, ఇఫ్పుడు 0.86గా మాత్రమే ఉంది. అంటే దీని ధరలు గత ఏడాదితో పోల్చితే పెరుగుదలలో ఒక శాతం కూడా లేదు.

పాలు, పాల ఉత్పత్తులు గత ఏడాది 3.83గా ఉండగా, ఈ ఏడాది 0.92గా ఉంది. ఆయిల్స్, ఫ్యాట్స్ ధరలు గత ఏడాది కంటే పెరిగాయి. గత ఏడాది 1.09గా ఉండగా, ఈసారి 1.41గా ఉంది. పండ్ల, కూరగాయల ధరలు గత ఏడాది కంటే తగ్గాయి. 2018లో 4.8గా ఉండగా, ఈ ఏడాది మైనస్ 4.62గా ఉంది. పండ్లు గత ఏడాది 17.57గా ఉండగా, ఈ ఏడాది మైనస్ 7.69గా ఉంది.
పప్పు ధాన్యాలు, చక్కెర, స్వీట్లు వంటి ధరలు పెరుగుదలలో గత ఏడాదితో పాటు ఇప్పుడు కూడా తగ్గుముఖం పట్టాయి. 2018లో మైనస్ 17.35గా ఉండగా, ఇప్పుడు మైనస్ 3.82గా ఉంది. చక్కెర, స్వీట్లు గత ఏడాది మైనస్ 0.26గా ఉండగా, ఇప్పుడు మైనస్ మైనస్ 6.92గా ఉంది. సుగంధ ద్రవ్యాలు ధరలు పెరిగాయి. గత ఏడాది మైనస్ 1.01గా ఉంటే, ఇప్పుడు 1.82గా ఉంది.
ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ తదితరాల ధరలు గత ఏడాది 4.47గా ఉంటే, ఇప్పుడు 3.54గా ఉన్నాయి. దుస్తులు, ఫుట్‌వేర్ గత ఏడాది 5గా ఉంటే, ఇప్పుడు 2.73, హౌసింగ్ గత ఏడాది 8.28గా ఉంటే, ఇప్పుడు 5.1, ఫ్యూయల్ అంట్ లైట్ గత ఏడాది 6.8, ఇప్పుడు 1.24గా ఉంది.


Click it and Unblock the Notifications