ఆసియాలో వరస్ట్ నుంచి బెస్ట్ కరెన్సీ: రూపాయి బలపడటానికి కారణమేమిటి?
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం వరకు దూసుకెళ్లింది. అంతకుముందు కేవలం ఆరు రోజుల్లో 161 పైసలు ఎగబాకింది. మంగళవారం కొంత బలహీనపడింది. ఓ విధంగా ఆసియాలో జోరుమీదున్న కరెన్సీ రూపాయి అంటున్నారు. అంతకుముందు వరుసగా బలహీనపడింది. బుధవారం కూడా 15 పైసలు బలహీనపడింది. అయితే వారం రోజులుగా రూపాయి బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

మళ్లీ ప్రధాని పీఠంపై మోడీ.. రూపాయిపై ప్రభావం
ముడి చమురులు ధరలు, డాలర్, అంతర్జాతీయ మార్కెట్ అంశాలతో పాటు ప్రధానంగా వచ్చే లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందనే అంశం వల్ల రూపాయి గత వారం రోజులు పాటు బలపడిందని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని పదవి చేపడతారని చెబుతున్నాయి. మార్కెట్లపై ఇది ప్రధానంగా ప్రభావం చూపుతోందని అంటున్నారు.

మళ్లీ ప్రధాని అయితే మరింత బలపడుతుంది
నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయితే రూపాయి విలువ మరింత బలపడుతుందని సింగపూర్‌కు చెందిన స్కాటియా బ్యాంక్ ప్రముఖ కరెన్సీ స్ట్రాటెజిస్ట్ గోవ్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.67కు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆసియాలో పెట్టుబడులు పెరగడం వంటి కారణాల వల్ల కూడా రూపాయి మారకం విలువ బలపడుతుందని చెబుతున్నారు.

రూపాయి బలపడటానికి కారణాలు
విదేశీ పెట్టుబడులు పెరగడం కూడా రూపాయి బలపడటానికి కారణంగా చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం మాత్రం రూపాయి విలువ కొంత బలహీనపడింది. మార్చి 18వ తేదీ వరకు 3.3 బిలియన్ డాలర్ల మేరకు విదేశీ సంస్థాగత పెట్టుబడులు వచ్చాయని, ఈ ఏడాదికి వచ్చిన 5.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది సగం కంటే ఎక్కువ. ఇది కూడా రూపాయి బలపడటానికి కారణమని చెబుతున్నారు. అయితే, మార్కెట్‌లో హఠాత్తుగా మార్పుకు అసలు కారణం మళ్లీ మోడీయే ప్రధాని అవుతారని సర్వేలు చెప్పడమేనని కొటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు చెందిన ప్రముఖ స్ట్రాటెజిస్ట్ అనింద్య బెనర్జీ అన్నారు.


Click it and Unblock the Notifications