రైతే రాజయ్యాడు. ఇప్పుడు రైతు గురించి దేశంలోని ప్రతీ ప్రభుత్వం విపరీతంగా ఆలోచిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతా ప్రేమ పుట్టుకురావడంతో వివిధ పథకాల రూపంలో నాలుగు డబ్బులు రైతుల జేబుల్లోకి చేరుతున్నాయి. వీటి ద్వారా వాళ్లకు ఎంత మేలు జరుగుతోంది, పంట పెట్టుబడిగా ఏ స్థాయిలో ఉపయోగపడ్తోందో తెలియట్లేదు కానీ... వెండికి మాత్రం గ్రామాల నుంచి అనూహ్యంగా గిరీకా పెరిగింది. నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరింది సిల్వర్ డిమాండ్.
2018లో మన దేశం 6442 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది అది 6590 టన్నులకు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు లెక్కగడ్తున్నాయి. 2015 తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో మనం వెండిని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ లెక్కలతో పోలిస్తే మరింతగా ఇంపోర్ట్స్ పెరగవచ్చని లండన్ రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఉన్నట్టుండి ఎందుకంత డిమాండ్
ఫిబ్రవరి ప్రకటించిన ఎన్నికల బడ్జెట్‌లో కేంద్రం ఎకరానికి ఒక్కో రైతుకు రూ.6 వేల పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. అందులో భాగంగా మొదటి విడతగా రూ.2000ను రైతుల ఖాతాలకే నేరుగా జమ చేసింది. తెలంగాణలో ఇప్పటికే రైతు బంధు పథకం అమల్లో ఉంది. వీటి వల్ల బంగారం కంటే వెండికి డిమాండ్ పెరిగిందని గోల్డ్ మర్చెంట్స్ చెబ్తున్నారు.
గత రెండేళ్లుగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పెద్దగా వీటిల్లో భారీ మార్పుల్లేవు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38 వేల వరకూ పలుకుతోంది. బంగారంతో పోలిస్తే ఇది పదిరెట్ల వరకూ తక్కువ కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిల్వర్‌కు ఊహించనంత గిరాకీ వస్తోందని తెలుస్తోంది. 2017లో భారీగా తగ్గిన వెండి దిగుమతులు, 2018లో మాత్రం 36 శాతం పెరిగాయి. 2019లో కూడా 7వేల టన్నులకు పైపడే ఇంపోర్ట్స్ ఉండొచ్చని వివిధ రీసెర్చ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ట్రేడ్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 2015లో అత్యధికంగా మనం 7579 టన్నుల వెండిని వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications