ఎన్పీఏలో ప్రపంచంలోనే భారత్ చెత్త రికార్డ్, ఇటలీని దాటి మొదటిస్థానంలోకి
న్యూఢిల్లీ: బ్యాంకులకు మొండి బకాయిల (ఎన్పీఏ) విషయంలో భారత్ ఇటలీని దాటేసి, ప్రపంచంలోనే అత్యంత చెత్త రికార్డును దాటేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. ఎన్పీఏల విషయంలో ఇప్పుడు ఇది అగ్రస్థానంలో నిలిచింది. గతంలో ఇటలీ మొదటి స్థానంలో ఉండేది.
మొండి బకాయిల విషయంలోని టాప్ 10 దేశాలు ఇవే.
1. భారత్- 10.3%
2. ఇటలీ-9.9%
3. బ్రెజిల్- 3.2%
4. ఫ్రాన్స్- 2.9%
5. చైనా - 1.9%
6. జర్మనీ- 1.5%
7. యూకే- 1.2%
8. జపాన్ - 1.1%
9. ఆమెరికా - 0.9%
10. కెనడా - 0.4%

డిసెంబర్ నాటికి భారత్‌లో ఎన్పీఏల నిష్పత్తి 2015 స్థాయి తర్వాత కనిష్ట స్థాయికి పతనమైందని ఆర్బీఐ తెలిపింది. సాధారణంగా ఎన్పీఏ నిష్పత్తిని బ్యాంకు మొత్తం రుణాల్లో మొండి బకాయిలను భాగించి లెక్కిస్తారు. ఇలా లెక్కిస్తే భారత్‌లో ఎన్పీఏ నిష్పత్తి గరిష్టంగా 10.3 శాతంగా తేలింది. ఇంతలా మొండి బకాయిలు పేరుకుపోయినప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదని ఆర్బీఐ తెలిపింది.
భారత్‌లోని బ్యాంకుల్లో ఎన్పీఏలు సుమారు రూ.13 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో పెట్టుబడులు లభించడం కష్టమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఎన్పీఏల్లో మొదటి స్థానంలో ఉన్న ఇటలీ గత సంవత్సరం కఠినమైన చర్యలు చేపట్టింది. మొండి బకాయిలను వసూలు చేసి ఎన్పీఏ ఒత్తిళ్లను నియంత్రించింది. 2016లో ఇటలీలో బ్యాంకులకు మొండి బాకీలను 360 బిలియన్ యూరోల నుంచి 200 బిలియన్ యూరోలకు తగ్గింది.


Click it and Unblock the Notifications