హైదరాబాద్ : అనిల్ అంబానీకి టైమ్ అప్ చెప్పేందుకు కోర్టు సిద్ధమవుతోంది. ఎరిక్సన్‌కు ఆయన చెల్లించాల్సిన రూ.453 కోట్ల బకాయిలకు ఇక నాలుగు రోజులు మాత్రమే గడువుతుంది. మంగళవారంలోగా సదరు డబ్బులను అనిల్ అంబానీ చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సిన దుస్థితి రావొచ్చు. గతంలో ఎరిక్సన్‌కు బకాయిపడిన రూ.571 కోట్లలో కొద్దికాలం క్రితం ఆయన రూ.118 కోట్లను కోర్టులో ఇప్పటికే డిపాజిట్ చేశారు. అయితే దీనిపై ఎన్నిసార్లు కోర్టుకు రావాలని ఆదేశించినప్పటికీ అనిల్ అంబానీ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల గడువును ఇచ్చింది. ఆ గడువు మంగళవారంలో ముగియబోతోంది.
ట్రైబ్యునల్ తకరారు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ చెందిన రూ.260 కోట్ల ట్యాక్స్ రిఫండ్స్ ప్రస్తుతం ఎస్బీఐ దగ్గర ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని అనిల్ అంబానీ అపిలేట్ ట్రైబ్యునల్‌ను అభ్యర్థించారు. అయితే దీనిపై తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని ట్రైబ్యునల్ కొట్టిపారేసింది. కావాలనుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. జాతీయ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లిన అనిల్ అంబానీ ఎస్బీఐ సహా 37 మంది రుణదాతలకు రూ.260 కోట్ల నిధుల విడుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వమని కోరింది. అయితే ఇది షేర్ హోల్డర్ల సొమ్మని, దీన్ని వ్యక్తిగతంగా ప్రైవేట్ పార్టీకి చెల్లించేందుకు తాము సిద్ధంగా లేమని రుణదాతలంతా తేల్చిచెప్పేశారు. దీంతో జూనియర్ అంబానికి ఉన్న ఆ దారి కూడా మూసుకుపోయింది.

దివాలా ప్రక్రియకు వెళ్తే..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దివాలా ప్రక్రియ (కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016)కు కంపెనీ వెళ్లకుండా చూసుకోవాలని ట్రైబ్యునల్ కోరింది. ఎందుకంటే ఒక వేళ ఈ వ్యవహారం సదరు శాఖకు వెళ్తే రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. ఆస్తులను అమ్ముకుని బకాయిలు తీర్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రక్రియలో ఆస్తులను వేలం వేయగా వచ్చే డబ్బుల్లో ఎస్బీఐ వంటి సంస్థలకు మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. ఎరిక్సన్ వంటి సంస్థలకు ఆఖరి అవకాశం ఉంటుంది. అందుకే వ్యవహారం అంత దూరం వెళ్లకుండా చూసుకోవాల్సిన రుణదాతలు భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications