పన్నుల విధానంలో జీఎస్టి అమలుతోపాటు పన్నుల వసూళ్లకు పకడ్భంధి ప్రణాళిక రూపోందించడంతో కమర్షియల్ టాక్స్ లో పన్ను రాబడులు ఎనబై శాతం వరకు చేరుకున్నాయి..దీంతో టార్గెట్ సుమారు 41 వేల కోట్ల రుపాయలు గత ఆర్ధిక సంవత్సరంలో వసూలు చేసింది.

పన్నుల రాబడిలో టార్గెట్ రీచ్ అయిన కమర్షియల్ టాక్స్ విభాగం
కేంద్ర ,రాష్ట్ర్రాలకు అధిక ఆదాయం సంపాదించిపెడుతున్న పన్నుల్లో కమర్షియల్ టాక్స్ లు ఒకటి .వీటని ఎంతో పకడ్బందిగా వసూలు చేస్తే గాని ఖాజాన నిండని పరిస్థితి. ఈనేపథ్యంలోనే కమర్షియల్ టాక్స్ జిఎస్టి విభాగం పన్నుల వసూళ్ల పూర్తి లక్ష్యానికి చేరుకున్నాయి.ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 52వేల 438 కోట్ల రుపాయల లక్ష్యం పెట్టుకోగా ఫిబ్రవరి నాటికి రూ. 40 వేల 690 కోట్ల రుపాయలు వసూలు చేసి ఎనబైశాతం లక్ష్యానికి చేరువైంది. ఇది ఈ ఆర్దిక సంవత్సరంలో 17 శాతం వృద్ది సాధించింది.

45 శాతం ఎక్సైజ్, పెట్రోలియం నుండే ఆదాయం
జీఎస్టి పరిధిలో లేకపోవడంతో పెట్రోలియం ఉత్పత్తులు,ఎక్సైజ్ శాఖల నుండి ఎక్కువ శాతం ఆదాయం వస్తుంది.మొత్తం రాబడుల్లో 45 శాతం వీటి నుండే వచ్చాయి,కాగా పన్ను వసూళ్లలో వ్యక్తులు ,సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యం అయిందని అధికారులు వివరించారు. నిత్యం వాహనాల తనిఖీలు ,దాడులు , కేసుల నమోదుతో ఈ సంవత్సరం నాలుగు వేలకు పైగా వాహనాలను తనిఖీ చేసి ,వందకు పైగా వెహికిల్స్ ను అదుపులోకి తీసుకుని జరిమాన విధించినట్టు కమర్షియల్ టాక్స్ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.

ఎగవేతలకు అడ్డుకట్ట వేసి బకాయిలపై దృష్టి
మరోవైపు ఎగవేతలకు అడ్డుకట్ట వేసి బకాయిలపై దృష్టి పెట్టారు. ఈనేపథ్యంలోనే పన్నుఎగవేతలకు అడ్డుకట్ట వేసి ,పాతబకాయిలపైదృష్టి సారించి వ్యాపారులందరిని పన్ను పరిధిలోకి తీసుకురావడంతో ఆదాయం పెరిగింది. దీంతో పాటు పన్నుల విధానాన్ని కంప్యూటరైజ్డ్ చేయడం రిటర్నులు ,రీ ఫండ్ల విషయంలో సింగిల్ విండో విధానం,దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కావడం కూడ రాబడి పెరుగుదలకు దోహదపడ్డాయి,రాష్ట్ర్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాట్, కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టి కలిపి పన్ను రాబడిని పెంచుతున్నాయి.జీఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను రాబడులు పెరుగుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications