నగరాల్లో ఆర్ధిక అవకాశాలు పెరుగుతుండడంతో చాల మంది లగ్జరీ లైఫ్ కు అలవాటుపడిపోతున్నారు..ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచానికి ప్రతి రోజు కొత్తగ కనిపించేందుకు తహతహలాడుతున్నారు..ఈ నేపథ్యంలోనే సాదాసీదా జీవీతానికి ఫుల్ స్టాప్ పెట్టి లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిపోతున్నారు..అయితే లగ్జరీ లైఫ్ కు అలవాటుపడుతున్న వారిలో ఎక్కువ రెండవశ్రేణి నగర ప్రజలు ఉన్నారు. దీంతో ఇండియాలోని రెండవ శ్రేణి నగరాల్లో లగ్జరీ మార్కేట్ వ్యాపారం దూసుకుపోతుంది.

కార్లు ,బట్టలు, చెప్పులే మాకు కావాలి.
ఈనేపథ్యంలోనే దేశవ్యాప్తంగా లగ్జరీ వస్తువులైన కార్లు, బట్టలు, చెప్పులు తో పాటు పౌడర్లు ,స్ప్రేలను భారతదేశ నగరాల్లో విపరీతంగా వాడేస్తున్నారు..దీంతో ఇండియన్ లగ్జరీ మార్కేట్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఓ వెలుగు వెలుగుతోందని ఆమేరికన్ ఎక్స్ ప్రెస్ తన నివేదికలో తెలిపింది..గత సంవత్సరం తో పోలిస్తే లగ్జరీ వస్తువుల వాడకం శాతం పెరిగినట్టు పేర్కోంది..దీనికి సంబంధించి సుమారు 600 పైగా బ్రాండ్ల అమ్మకాలను పరీశీలించినట్టు నివేదికలో తెలిపింది.

మోజు తగ్గిన బంగారం..
సాధరణంగా లగ్జరీ వస్తువుల్లో మొదటగా వచ్చే వస్తువు బంగారం ,కాని బంగారం పై మాత్రం రెండవ శ్రేణి నగరాల్లో మోజు తగ్గింది..నగర ప్రజలు బంగారాన్ని తమకు పెద్దగా ప్రయరీటి కాదని, చెబుతున్నారు.దీనికి బదులుగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాషన్ దుస్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు..దీంతో బంగారం కోనుగోళ్లు ఈ నగరాల్లోవెనకపడిపోయాయి.

మెట్రో నగరాల్లో బంగారమే టాప్
అయితే రెండవ శ్రేణి నగరాల్లో బంగారానికి పెద్దగా డిమాండ్ లేకపోయినా,,మెట్రో నగరాల్లో మాత్రం బంగారం కోనుగోళ్లే పై చేయిని సాధించాయి..2018 సంవత్సరంలో హైద్రబాద్ తోపాటు బెంగళూర్, ముంబై,ఢిల్లి పట్టణాల్లోసుమారు 26 శాతం కోనుగోళ్లు పెరిగాయని నివేదిక పేర్కోంది. కాగా రెండవ శ్రేణి నగరాల్లో బంగారం కొనుగోళ్లు కేవలం నాలుగు శాతం మాత్రమే కోనుగోలు చేశారు..ఈనేపథ్యంలో ఎక్కువగా ప్యాషన్ బోటీక్స్ షాపుల నుండి కోనుగోళ్లు చేయడానికి ఇట్రెస్ట్ చూపారని తెలిపింది..

పురుషులే ఎక్కువ కొంటున్నారు,
అయితే లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ శాతం పురుషులు ఉన్నారని నివేదిక పేర్కోంది.కాగా వీరు కార్లు, హోటళ్లపై ఎక్కవగా ఖర్చు చేసినట్టు పేర్కోంది.మొత్తం మీద బంగారం కొనుగోళ్లు తగ్గి, ఇతర లగ్జరీ వస్తువుల పెరగడంతో వీటీ మార్కేట్ ఊపందుకుంది.


Click it and Unblock the Notifications