ఫోన్లను వాడేస్తున్నారు..ఓక్క మొబైల్ ఒక్క సంవత్సరమే
స్మార్ట్ ఫోన్ల వాడకం వినియోగం దేశంలో విపరీతంగా పెరిగిపోతుంది,స్మార్ట్ మొబైల్ ధరలు అందుబాటులోకి రావడంతోపాటు ఇంటర్ నెట్ ల ధరలు దిగిరావడంతో స్మార్ట్ ఫోన్లను వెంటవెంటనే మార్చేస్తున్నారు వినియోగదారులు..దీంతో ఓక్క మొబైల్ ను ఓక్క సంవత్సరానికే మార్చేస్తున్నారు.

ఫీచర్లు మారడమే ఇందుకు కారణమా..
స్మార్ట్ ఫోన్లలో ఫీచర్లు ఎంత అభివృద్ది చెందుతున్నాయో అంతే వేగంగా వాటిని వినియోగదారులు మార్చేస్తున్నారు ..దీనికి తోడు ఫోన్ల్ కేలవం సామాజిక అవసరాలను తీర్చడమే కాకుండా వ్యాపార అవసరాలను కూడ తీర్చుతున్నాయి..ఈ నేపథ్యంలోనే కోత్త ఫీచర్స్ తో వస్తున్న సరికోత్త ఫోన్లను వెంటవెంటనే కోనుగోలు చేస్తున్నారు..ఇలా సంవత్సరంలో 40 శాతం మంది వినియోగదారలు ఒక్క సంవత్సరం మాత్రమే వాడుకుని మొబైల్ మారుస్తున్నారట..ఇలా సంవత్సరానికి ఒకసారి ఫోన్లు మార్చేవారి శాతం మొత్తం ఫోన్లు కొనుగోలు చేస్తున్న వారి లో ఎక్కువ శాతమే ఉన్నారని, 91 మొబైల్ డాటా సుమారు తన నివేదికలో తేల్చింది.. కాగా ఈ నివేదికను సుమారు 15000 వినియోగదారులలో సర్వే జరిపింది..ఇందులో పలు ఎందుకు మార్చుతున్నారు, ఎలాంటీ ఫోన్లను మార్చుతున్నారనే తదితర అంశాలను జోడించింది.

మొబైల్స్ ను ఎందుకు మార్చుతున్నారు.
మొబైల్స్ ను మారుస్తున్న వినియోగదారులు ప్రధానంగా ఆన్ లైన్ లో రీసెర్చ్ చేయడంతో పాటు స్పిడ్ , కెమేరా రిజల్యుషన్, సెల్ఫీల సామర్థ్యం, బ్యాటరీ బ్యాకప్ లకు ప్రాధన్యం ఇస్తున్నారు...దీంతోపాటు ప్రాసెసర్, బ్రాండ్, ర్యామ్ సామర్థ్యం , దీంతో ఈ ఫీచర్లు ఉన్న ఫోన్లు మార్కేట్ లోకి రావడంతోనే వాటని కొనేస్తున్నారు.సాధరణంగా యువత ఫోన్లను మార్చడంలో ముందుండగా మహిళలు సైతం రెండవ స్థానంలో ఉన్నారు..ఇక మూప్పై అయిదు సంవత్సరాలు పై బడిన వారు మాత్రం బ్యాటరీ బ్యాకప్ చూసి ఎక్కువగా మార్చుతున్నారని తేలింది..

ఏ ధరలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు..
సాధరణంగా మొబైల్ వాడకం దారులు 10 వేల నుండి 20 వేల రుపాయల మధ్య ఉండే స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట..కాగా వీరు 60 శాతం పైగానే ఉన్నారు..మరోవైపు ఆఫ్ లైన్ లో కంటే ఆన్ లైన్ లో కొనుగోలు చేసే వారి శాతం ఎక్కువగా నే ఉంటుంది..ఆన్ లైన్ కొనుగోలు చేసేవారు 44 శాతం ఉండగా ఆఫ్ లైన్ లో 40 శాతమే ఉన్నారు.ఇందుకు కారణం ఆన్ లైన్ లోనే తక్కువ ధరలు ఉండడమని నివేదిక పేర్కోంది.

ఏ కంపనీలు మొబైల్స్ మారుస్తున్నారు...
మొబైల్స్ మారుస్తున్న వారిలో షామీ కి చెందిన ఫోన్లను 25 శాతం ఉండగా ,సామ్ సంగ్ 19 శాతం ,రియల్ మీ,5 శాతం నోకీయా 3 శాతం కొనుగోలు చేస్తున్నారు..


Click it and Unblock the Notifications