తోలగించుకో ఏం ఇబ్బంది లేదు...

ఇండియాకు ప్రాధాన్యత వాణిజ్య హోదాను [జీ ఎస్ పీ,] తొలగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంపై భారత వాణిజ్య శాఖ అధికారులు స్పందించారు . ట్రంప్ నిర్ణయం వల్ల మన దేశ ఎగుమతులపై పెద్దగా ప్రభావమేమీ చూపించదని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వాధవన్‌ తెలిపారు.
జీ ఎస్ పీ క్రింద భారత్‌ 5.6 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతుల వల్ల భారత్‌కు ఏటా కేవలం 190 మిలియన్‌ డాలర్ల ప్రయోజనం చేకూరుతుంది. అయితే జీఎస్‌పీ తొలగింపుతో భారత ఎగుమతులపై పెద్ద ప్రభావం ఉండకపోవడంతోపాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఎలాంటి ప్రభావం చూపించదని అనూప్‌ తెలిపారు.

there is no problem GSP benefit withdrawal by US

జీఎస్‌పీ ప్రోగ్రామ్‌ కింద అమెరికా కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత వాణిజ్య హోదా కల్పిస్తోంది. అందులో భారత్‌ ఒకటి.దీంతో భారత్ ఎక్కువ వస్తువులను ఎగుమతి చేస్తుందని భావిస్తున్న ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు భారత మార్కెట్లలో అమెరికాకు నిష్పక్షపాత అవకాశాలు కల్పించడం లేదని, భారత్‌కు జీఎస్‌పీ హోదాను తొలగించాలని ట్రంప్‌ ప్రతిపాదించారు.
కాగా ఇది అమలు అయ్యోందుకు కనీసం అరవై రోజుల సమయం పడనుంది..అమేరికా కాంగ్రెస్ తో పాటు భారత ప్రభుత్వానికి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇది అమల్లోకి రానుంది..కాగా ఈ సయంలోనే భారత అధికారులు అమేరికా భేటి అయ్యి దీనికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం కూడ ఉంటుంది..

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+