డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన బుద్ధి చూపించారు. ఇండియాకు ఇంతకాలం నుంచి ఇస్తున్న జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్‌పీ)ని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు స్వయంగా కాంగ్రెస్‌కు వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి వాణిజ్య పరమైన ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. ఎన్నికలకు వెళ్లబోతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిజంగా ఇదో షాక్ లాంటిదే. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల నేపధ్యంలో సుమారు రూ.40,000 కోట్ల విలువైన యూఎస్ ఎగుమతులపై ప్రభావం చూపబోతున్నాయి.

ఏంటీ జీఎస్‌పి
అభివృద్ధి చెందుతున్న దేశాలతో యూఎస్ ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం లాంటిది ఈ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. దీని వల్ల ఇరు దేశాల మధ్య సులువైన వాణిజ్యం జరిగేందుకు దోహదపడ్తుంది. మన ఎలాంటి డ్యూటీలు చెల్లించకుండా కొన్ని వస్తువులను యూఎస్‌కు ఎగుమతి చేయొచ్చు. అదే సమయంలో అమెరికాను కూడా వివిధ రంగాల్లో మనం అనుమతించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కింద సుమారు 2000 ఉత్పత్తులను మన అమెరికా దేశానికి ఎగుమతి చేస్తున్నాం. వీటిలో ఆటో విడిభాగాలు, ఇండస్ట్రియల్ వాల్వ్స్, టెక్స్‌టైల్ మెటీరియల్ వంటివి ఉన్నాయి. 2017లో మనం సుమారు 5.7 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఈ ప్రోగ్రాం కింద అమెరికా దేశానికి ఎక్స్‌పోర్ట్ చేశాం.

ఇప్పుడేంటి
ఇండియా ఈ ప్రోగ్రాం కింద డ్యూటీ ఫ్రీలో యూఎస్‌కు భారీ ఎత్తున వస్తువులను ఎగుమతి చేస్తోంది కానీ తమ దేశ కంపెనీలకు మాత్రం వివిధ రంగాల్లో ఎలాంటి ప్రయోజనం కల్గించనీయకుండా చేస్తోంది అంటూ డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికీ అనేక అమెరికన్ ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు విధిస్తోందని, ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదనేది ట్రంప్ వాదన.

స్టంట్స్ దెబ్బ
వాస్తవానికి డైరీ, మెడికల్ డివైజెస్ విషయంలో డోనాల్డ్ ట్రంప్ ఊగిపోతున్నారు. ఎందుంటే ప్రధానంగా పాలు, పాల ఉత్పత్తులు మన దేశంలో అడుగుపెడితే ఇక్కడి పరిశ్రమలు, పాడి రైతులు ఇబ్బందిపడ్తారనే ఉద్దేశంతో కేంద్రం ఇంతకాలం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది.
మరోవైపు వైద్యాన్ని, వైద్యపరికరాలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు కేంద్రం తీవ్రంగా యత్నించింది. అందులో భాగంగా స్టంట్స్(గుండె సంబంధ ట్రీట్‌మెంట్‌లో వినియోగించేవి) రేట్లను 40-50 శాతానికి పైగా కిందికి దించింది. దీని వల్ల విదేశీ కంపెనీలు నష్టపోతున్నాయని, పెద్దగా లాభం ఉండడం లేదని రోనాల్ట్ ట్రంప్ సర్కార్ వాదన. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కూడా ఈ రెండు రంగాల్లో అమెరికా పెత్తనాన్ని చూస్తూ ఊరుకోవడం కష్టం.

మనకు కష్టమా
డోనాల్డ్ ట్రంప్ లేఖ నేపధ్యంలో మళ్లీ రెండు దేశాల మధ్య వాణిజ్య ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే మళ్లీ బేరసారాలు నడిపేందుకు మనకు 60 రోజుల సమయం దొరుకుతుంది. ఈ లోపు ఇరు దేశాల వాణిజ్య శాఖ ప్రతినిధులు చర్చలు జరిపి ఓ అవగాహనకు వస్తూ అప్పుడు జీఎస్‌పి హోదా కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications