భారత సినిమాలు బ్యాన్ చేసిన పాక్.. ! మనకొచ్చే నష్టమేంటో తెలిస్తే నవ్వుకుంటారు
సినిమాలు, ఆటలు... భారత్ - పాక్ మధ్య ఇవి ఎప్పుడూ ఓ హాట్ టాపిక్. రెండు దేశాల మధ్య వాతావరణం ఏ కొద్దిగా వేడెక్కినా మొదటగా ఎఫెక్ట్ అయ్యేవి ఇవే. తాజాగా పుల్వామా ఘటన సహా ఇరు దేశాల మధ్య జరిగిన ఓ చిన్నపాటి యుద్ధం తాజాగా రెండు రంగాలను లైమ్ లైట్‌లోకి తెచ్చింది. భారత సినిమాలను తమ దేశంలో ప్రదర్శించబోమని పాకిస్తాన్ తేల్చిచెప్పింది. ఇంతకీ దీని ప్రభావం మన బాలీవుడ్‌పై ఉంటుందా.. పాకిస్తాన్‌పై ఉంటుందా.. ఎవరికి నష్టం.. ఎవరికి కష్టం.. సరదాగా చూద్దాం రండి.
గేమ్స్ ఆడొద్దు
భారత్ - పాక్ దేశాలు క్రికెట్ 2008 తర్వాత బైలెటరల్ సిరీస్ ఇప్పటివరకూ ఆడింది లేదు. అక్కడక్కడ తలపడడం మినహా పెద్దగా మనం - పాకిస్తాన్ ఆడిన దాఖలాలు తక్కువే. బిసిసిఐ కూడా పాకిస్తాన్‌తో భారత్ తలపడేందుకు అంత సుముఖంగా లేదనే విషయాన్ని ఈ మధ్యే స్పష్టం చేసింది.

సినిమాలు
ప్రస్తుతం పాకిస్తాన్‌లో సుమారు 170 సినిమా స్క్రీన్స్ ఉన్నాయి. మన దేశ మార్కెట్‌తో పోలిస్తే ఇది అసలు లెక్కేకాదు. ఇండియాలో మొత్తం 9000 స్క్రీన్స్ ఉన్నాయి. ఒక్క పివిఆర్ సినిమాస్ దగ్గరే 748 స్క్రీన్స్ న్నాయి. పాక్‌లో ఉన్న ఆ థియేటర్లలో కూడా బాలీవుడ్ సినిమాలే అధికంగా ప్రదర్శితమవుతాయి. ఇండియన్ సినిమాలను బ్యాన్ చేయాలని పాక్ తీసుకున్న నిర్ణయం వల్ల మనకు పెద్దగా ఇబ్బంది లేదనే అనిపిస్తోంది.
పాక్ మార్కెట్ రూ. 60 కోట్లే
అంచనాల ప్రకారం పాకిస్తాన్ బాక్సాఫీస్ మార్కెట్ కేవలం రూ.60-65 కోట్లు. మన మార్కెట్ ఏకంగా రూ. 10300 కోట్లు. ఒక వేళ పాక్ మన సినిమాలను ప్రదర్శించకపోయినా మనము జరిగే నష్టం ఏ పాటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అక్షయ్ కుమార్ వంటి హీరోల సినిమా ఒక్కటే సుమారు రూ.100 కోట్ల కలెక్షన్లను రాబడ్తుంది. ఈ లెక్కన పాక్ మన సినిమాలను నిషేధించడం వల్ల మనకు పోయేదేం లేదు.


Click it and Unblock the Notifications