పిఎమ్ కిసాన్ పథకం కింద రైతులకు మరింత ప్రయోజనం.
2019 తాత్కాలిక బడ్జెట్లో రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిషన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అని పిలువబడే ఆదాయం మద్దతు పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది
2019 తాత్కాలిక బడ్జెట్లో రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిషన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అని పిలువబడే ఆదాయం మద్దతు పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. చిన్న మరియు సన్నకారు రైతులుకు ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉద్దేశించి పిఎమ్ కిసాన్ పథకం లో భంగంగా రూ. 6,000 రూపాయలు రైతులకు అందించనుంది. పిఎమ్ కిసాన్ పథకం లేదా కిసాన్ యోజన అంచనా రూ. 75,000 కోట్లు. ఈ పథకం కింద, రెండు హెక్టార్ల భూమి కంటే తక్కువగా ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులు వారి ఖాతాలలో నగదు జమచేయబడుతుంది. 2,000 రూపాయల చొప్పున మూడు ధపాలుగా చెల్లించబడుతుంది అని వ్యవసాయ మంత్రిత్వశాఖ మరియు వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ శాఖ పథకం పత్రంలో పేర్కొంది.

రైతులకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం లేదా పిఎమ్ కిసాన్ యోజన గురించి ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి:
- కిసాన్ యోజన కింద,రెండు హెక్టార్ల లోపల భూమి ఉన్న చిన్న మరియు సన్నకారు రైతుల కుటుంబానికి సంవత్సరానికి 6,000 (మూడు సమాన వాయిదాల్లో) అందిస్తారు.
- అర్హత కలిగిన రైతులకు లబ్ధిని బదిలీ చేయటానికి డిసెంబరు 1, 2018 నుండి కిసాన్ యోజన సమర్థవంతంగా వర్తిస్తుంది.ఈ పథకం కింది మొత్తం 12.5 కోట్ల లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది.
- మొదటి విడత - మార్చి 31, 2019 తో ముగిసిన నాలుగు నెలల కాలానికి - ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) లో అర్హత పొందిన లబ్ధిదారులకు బదిలీ చేయబడుతుంది. పథకం పత్రం ప్రకారం లబ్ధిదారుల గుర్తింపుపై మొదటి విడత వెంటనే బదిలీ చేయబడుతుంది.
- ప్రభుత్వం ప్రకారం,పిఎమ్ కిసాన్ పథకం కింద ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కోట్ తప్పనిసరి. ఆధార్ సెడెడ్ డాటాబేస్ ఆధారంగా మాత్రమే తరువాతి వాయిదాల బదిలీ చేయబడుతుంది మరియు పథకం పత్రం ప్రకారం ఆధార్ కార్డు లేని వారు వెంటనే ఆధార్ కార్డును ఎన్రోల్ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపింది.
- నాలుగు నెలలు రూ. 2,000 రూపాయలు చొప్పున మూడు విడతలుగా అర్హతగల రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్షంగా క్రెడిట్ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications