హైదరాబాద్ : ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు... ఈ బడ్జెట్ లో 1,82,017 కోట్లను ప్రతిపాదించారు... ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినా .. ఎవరికీ ఆర్థికశాఖ కేటాయించకపోవడంతో అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్, బడ్జెన్ ప్రవేశ పెట్టారు..కాగా మండలిలో మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ను చదివి వినిపించారు. కాగా రాష్ట్రంలో సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

లక్షా 82 వేల కోట్లతో బడ్జెట్.... రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు
ఓట్ ఆన్ బడ్జెట్ రూ.1,82,017 కోట్లు ప్రతిపాదించారు సీఎం కేసీఆర్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.32,815 కోట్లని .. రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లుగా ప్రకటించారు..

గణనీయమైన వృద్ధి
సిఎమ్ కేసిఆర్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను వివరించారు..ప్రధానంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు పెర్కోన్నారు...కాగా రాష్ట్ర. వృద్ధి రేటు 10.6 శాతం సాధించడమే ఇందుకు నిదర్శమని తెలిపారు.

వ్యుద్యాప్య పెన్షన్ 2016 ,వికాలాంగులకు 3016 అమోదించిన సభ...
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,016కు పెంచుతున్నామని సభలో ప్రకటించారు. అలాగే దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,016 .. వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను అందిస్తామని ప్రకటించారు. ఆసరా పింఛన్ల కోసం బడ్జెట్‌లో రూ.12,067 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారాయన.

దేనికి ఎంత.....
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫికి రూ.6 వేల కోట్లు కేటాయించారు....వ్యవసాయశాఖకు రూ.20,107 కోట్లు, నీటిపారుదలశాఖకు రూ.22,500 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.1450 కోట్లు కగా ,ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్లు కేటాయించారు. , ఎస్సీల సంక్షేమానికి రూ.16,581 కోట్లు , ఎస్టీల సంక్షేమం రూ.9,827 కోట్లు ,మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. . . సన్న బియ్యం రాయితీ కోసం రూ.2,774 కోట్లు , ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్టు , ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536 కోట్లు ,ప్రకటించారు కేసీఆర్.

రైతుకు అండగా
ఇదివరకు మాదిరిగానే రైతులకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు. రైతు బీమా కోసం రూ.650 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు మరణించే రైతులకు ఈ పథకంతో మేలు జరుగుతుంది. ఆ కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందజేస్తారు. రైతు బంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. గతేడాది ఎకరానికి రూ.4 వేలు ఇవ్వగా ఈ ఏడాది నుంచి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు ఇస్తారు. ఇస్తామని పద్దులో ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం గంటపాటు బడ్జెట్ ప్రసంగించగా .. సభ్యులు బల్లచరిచి అభినందనలు తెలిపారు. చివరగా జై హింద్, జై తెలంగాణ అనే నినాదాలతో కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications