బేర్ గ్రిప్‌లో స్టాక్ మార్కెట్లు.. ట్రేడర్స్ స్ట్రాటజీ ఇలా ఉంటేనే లాభాలు
స్టాక్ మార్కెట్ సూచీలు దిగాలుపడ్డాయి. గతవారాంతంలో నిరుత్సాహంగా క్లోజైన సూచీలు.. వారం ప్రారంభంలోనూ అదే బలహీనమైన ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. నిఫ్టీ కీలకమైన 11 వేల పాయింట్ల మార్కును అధిగమించి ముందుకు సాగుతోంది అనుకునే తరుణంలో సడెన్ బ్రేక్ డౌన్ మార్కెట్లను కమ్మేసింది. దీంతో మళ్లీ 10950 పాయింట్ల మార్కును కూడా మరోసారి నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు 10850 పాయింట్ల స్థాయికి రావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎందుకిలా
గతవారంలోని నాలుగు ట్రేడింగ్ సెషన్స్‌లో మార్కెట్లలో భారీగా పుట్ రైటింగ్ జరిగింది. అయితే 11000 పాయింట్ల కాల్ ఆప్షన్‌కు హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూశాం. అయితే తర్వాత ఫాలో అప్ బయింగ్ రాకపోవడంతో బుల్స్ నిలబడలేకపోయాయి. దీంతో లాభాలన్నింటినీ కోల్పోయి కిందికి దిగి వస్తోంది.

ఇప్పుడేంటి
గత వారం ప్రారంభంలో వచ్చిన జోరుతో మార్కెట్లలో కొద్దిగా లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంకా కొద్దోగొప్పో స్ట్రెంగ్త్ కనబరుస్తున్నాయి. టెక్నికల్‌గా మీడియం టర్మ్ పాజిటివ్‌గానే ఉన్నాయి.. షార్ట్ టర్మ్ మాత్రం అంత గొప్పగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి నిఫ్టీ 10800 - 11100 రేంజ్‌లోనే కదలాడ్తుంది కానీ.. అంతకు మించిన మూమెంట్‌ను మనం ఊహించలేం.
ట్రేడర్స్ స్ట్రాటజీ
ప్రస్తుత స్థితిలో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఎలాంటి భారీ లాభాలను మనం ఊహించలేం. అందుకే ట్రేడర్స్ హెవీ పొజిషన్స్ జోలికి వెళ్లకుండా లైట్ పొజిషన్స్‌తో ఉండడం మంచిది. నిఫ్టీ క్లియర్‌గా 11100 పాయింట్ల పైన ముగిస్తేనే మనం 11350-11400 గురించి ఆలోచించవచ్చు. ఒకవేళ 10800 పాయింట్ల దిగువన వరుసగా క్లోజ్ అయితే మాత్రం షార్ట్ టర్మ్‌లో మరింత నీరసం తప్పకపోవచ్చు.
ఇప్పుడున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే.. ఫార్మా, ఐటి వంటి డిఫెన్సివ్ బెట్స్‌వైపు మొగ్గుచూపడమే మంచిది. ట్రేడింగ్‌కు టిసిఎస్, టెక్ మహీంద్రా, బయోకాన్, అలెంబిక్ ఫార్మా మెరుగ్గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications