ఇండియాలో రూ.100 కోట్ల ఆదాయం ఉన్నవారు 61 మంది? హవ్వ నిజమేనా?
దేశం వెలిగిపోతోంది. జనాల ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక
వ్యవస్థల్లో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది. టాప్ త్రీ స్థానంలోకి
ఇండియా వెళ్తోంది.. అంటూ మనం ఎన్ని ఊదరగొట్టుకుంటున్నా గ్రౌండ్‌లో పరిస్థితి మాత్రం వేరని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే దేశంలో రూ.100 కోట్లకుపైగా ఆదాయం ఉన్న వాళ్ల సంఖ్య 61కి మాత్రమేనని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాక్రిష్ణన్ లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో అంతా విస్తుపోయారు. అయితే మరో ఆశ్చర్యం ఏంటంటే.. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య 38 మాత్రమే ఉండేదని, అది ఇప్పుడు రెట్టింపు అయింది అనేది ప్రభుత్వ మాట.

ఈ లెక్క నమ్మేలా ఉందా..
రూ.100 కోట్లకుపైగా ఆదాయం ఉండి, అంత మొత్తాన్ని ఐటి రిటర్న్స్‌లో చూపించే వాళ్ల సంఖ్య ఇది. దీన్ని బట్టి అధిక ఆదాయాలు ఉన్నా దాన్ని లెక్కల్లో చూపించడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రతీ ఏటా ఫోర్బ్స్ వంటి ప్రముఖ పత్రికలు ప్రచురించే బిలయనీర్స్ లెక్కకూ.. దీనికీ పొంతనలేదని తేలింది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తూ.. బయటకు కనిపిస్తున్న వ్యాపారవేత్తలూ, నేతలంతా రిటర్న్స్ దాఖలు చేయడం లేదనేది దీని అర్థం.
అంతా బినామీలేనా
ప్రభుత్వం విదేశాల్లో ఉంటున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించే యోచన
పక్కనబెట్టి మొదట ఇండియాలో పన్న ఎగ్గొడ్తున్న బిలయనీర్ల సంగతి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో దాక్కున్న వారిని ఇండియా రప్పించేందుకు ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయకుండా ఇక్కడ అందుబాటులో ఉన్న వారినీ లాగినా అధిక ఆదాయం వస్తుందనేది వాళ్ల సలహా. ఇంకో విషయం ఏంటంటే.. కేంద్రం అట్టహాసంగా చెప్పిన బినామీ యాక్ట్ ద్వారా ఇప్పటివరకూ వాళ్లు ఎటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.6900 కోట్లు మాత్రమే.


Click it and Unblock the Notifications