రిలయన్స్.. ఇదో మహా సామ్రాజ్యం. చిన్న పెట్రోల్ బంకులో చిరుద్యోగిగా మొదలుపెట్టి.. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అనిల్ అంబానీ ఫెయిల్యూర్ స్టోరీ
రిలయన్స్.. ఇదో మహా సామ్రాజ్యం. చిన్న పెట్రోల్ బంకులో చిరుద్యోగిగా మొదలుపెట్టి.. ఓ ఫుట్ బాల్ స్టేడియంలో ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాలో టాప్ బిజినెస్ సంస్థగా, లక్షలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించిన ఈ సంస్థ ఆయన హయాంలో పది మెట్లు ఎక్కితే.. కొడుకుల హయాంలో అది వందమెట్లకు చేరింది. అయితే కొడుకులిద్దరూ కొట్టుకోవడం వల్ల పరిస్థితుల్లో మార్పొచ్చాయి.

ఓ సారి హిస్టరీలోకి వెళ్తే..
ఒక సారి హిస్టరీలోకి వెళ్తే 2002లో ధీరూబాయ్.. ఎలాంటి వీలునామా రాయకుండా కన్నుమూశారు. దీంతో అప్పటి వరకూ అతిపెద్ద సామ్రాజ్యంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఎవరు సారధ్యం వహిస్తారనే మాట వచ్చింది. ముందు నుంచీ అన్న ముకేష్ అంబానీ, తమ్ముడు అనిల్ అంబానీ మధ్య సానుకూల వాతావరణమే ఉండేది. ముకేష్.. ఆస్తుల నిర్వాహణను చూసుకుంటే వ్యాపార విస్తరణపై దృష్టిపెడితే.. తమ్ముడు ఇన్వెస్టర్ రిలేషన్స్, ఇతర కార్పొరేట్ సంస్థలతో చర్చలు, ఇతర దేశాల్లో పనులు చక్కబెట్టడం చేసేవాడు. ఎందుకంటే ముకేష్ మితభాషి, తమ్ముడు కాస్త ఔట్ స్పోకెన్. ఇలా సజావుగా సాగిపోతున్న తరుణంలో తండ్రి మరణం భారీ షాక్. అయితే ముకేష్ అంబానీ... కాస్త దూకుడుగా ఉంటూ.. మొత్తం తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూశారు అంటారు అప్పటి మార్కెట్ జనాలు.

అన్నాదమ్ముల మధ్య చిచ్చు
మూడేళ్ల పాటు గొడవలు తారా స్థాయికి చేరడంతో తల్లి కోకిలా బెన్ సహా వాళ్ల కుటుంబ ఆధ్యాత్మిక గురువు శ్రీనాథ్ సమక్షంలో ఇద్దరి మధ్యా సయోధ్య కుదిరింది. ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఎండి కెవి కామత్ సారధ్యంలో ఇద్దరూ 2005లో వాటాలు పంచుకున్నారు. అప్పట్లో రిలయన్స్ విలువ సుమారు రూ.లక్ష కోట్లు ఉండేది. పెట్రోలియం బిజినెస్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ పెట్‌కెమ్ కార్పొరేషన్ సంస్థను అన్న ముకేష్ అంబానీ తీసుకున్నారు. టెలికాం, విద్యుత్, క్యాపిటల్ వ్యాపారాలను తమ్ముడు అనిల్ అంబానీ తీసుకున్నారు. ఇద్దరూ సమంగా వ్యాపారాలు పంచుకుని.. ఎవరూ మరొకరి వ్యాపారంలో పోటీగా బిజినెస్ చేయొద్దని తీర్మానించుకున్నారు. అప్పట్లో టెలికాం బిజినెస్ బూమ్‌లో ఉండడంతో అనిల్ అంబానీ.. దేశంలోనే నెంబర్ ఒన్ ధనికుల జాబితాలో నిలిచారు. అయితే ఇక్కడ ముకేష్ దూకుడుగా వెళ్లకుండా కేవలం పెట్రోలియం, టెక్స్‌టైల్ వ్యాపారాల్లోనే దృష్టినిలిపి స్థిరపడ్తూ వచ్చారు.

అనిల్ అత్యుత్సాహం నెత్తికి తెచ్చింది
అటువైపు అనిల్ అంబానీ సంబంధం లేని వ్యాపారాల్లో తలదూరుస్తూ వచ్చారు. ఇన్ఫ్రా, కమ్యూనికేషన్స్, పవర్, క్యాపిటల్, హోం ఫైనాన్స్, నావల్.. ఇలా విస్తరించారు. 2008 మాంద్యం సమయంలో బొమ్మ తిరగబడిపోయింది. టెలికాం మొత్తం నాశనమైపోయింది. అనేక వ్యాపారాలు మాంద్యం దెబ్బకు కరిగిపోయాయి.
అనిల్ అంబానీ చేపట్టిన అనేక ప్రాజెక్టులు నష్టాలను మిగులుస్తూ వచ్చాయి. మరోవైపు ముకేష్ అంబానీ.. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో వంటి వ్యాపారాలను సక్సెస్‌ఫుల్‌గా మార్చుకున్నారు. ఎక్కువగా హడావుడిగా వెళ్లకుండా నిలుచుని నీళ్లుతాగారు. ఏదైనా ప్రాజెక్ట్ చేపడితే దాన్ని సక్సెస్ చేయడానికి ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేసేవారు. అదే అనిల్ అంబానీ.. ఫ్లాషీ లైఫ్ స్టైల్‌తో ఎప్పుడూ జనాల్లో ఉండాలనే తాపత్రయంతో ఎక్కువ విలాసాలకు పోయేవారు.

అన్న ఆకాశానికి.. తమ్ముడు అప్పుల్లోకి
ఇలా.. ఒకొరు మెట్లెక్కుకుంటూ పైకి వెళ్తే... మరొకరు.. లిఫ్ట్ దిగి కిందికి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం అన్నాదమ్ముల మధ్య ఆస్తుల వ్యత్యాసం అక్షరాలా రూ.2.5 లక్షల కోట్లకు చేరింది.ప్రస్తుతం ముకేష్ ఆస్తి రూ.2.7 లక్షల కోట్లు ఉంటే, అనిల్ ఆస్తి రూ.10 వేల కోట్లకు లోపే పరిమితమైంది. పదమూడేళ్ల క్రితం రూ.50 వేల కోట్ల ఆస్తితో మొదలైన అనిల్ అంబానీ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు నెగిటివ్ చూపిస్తోంది. కొన్ని సంస్థల దగ్గర తీసుకున్న రుణాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరారు అనిల్. ఆయన ముట్టుకున్న కంపెనీలన్నీ మసైపోతున్నాయి.

రిలయన్స్ కమ్యూనికేషన్స్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా స్టేజ్‌కు వెళ్లింది. అది రేపో, మాపో ఆస్తుల వేలానికి వెళ్లేట్టుంది. ఇక రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోం ఫైనాన్స్ కూడా అదే బాటలో నడుస్తున్నాయి. చూశారుగా..ఇదీ అన్నాదమ్ముల సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టోరీ. ఎంతో మంది బిజినెస్ స్టూడెంట్స్‌కే కాకుండా చాలా మంది వ్యాపారస్థులకు కూడా వీళ్ల కథనం ఓ పాఠం.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications