తెలంగాణలో ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు?కెసిఆర్ మాస్టర్ మైండ్ తెలిస్తే అవాక్కవుతారు

టిఆర్ఎస్ అధినేత ఏది చేసినా సంచలనమే. ఇతరుల కంటే భిన్నంగా తనదైన శైలిలో ఏ పనైనా చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడతారు.2019-2020 తెలంగాణ బడ్జెట్ విషయంలో కూడా అదే తరహా పద్ధతిని ఫాలో కాబోతున్నారు.

టిఆర్ఎస్ అధినేత ఏది చేసినా సంచలనమే. ఇతరుల కంటే భిన్నంగా తనదైన శైలిలో ఏ పనైనా చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడతారు.2019-2020 తెలంగాణ బడ్జెట్ విషయంలో కూడా అదే తరహా పద్ధతిని ఫాలో కాబోతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా కూడా ఓట్ ఆన్ అకౌంట్‌ను ఆయన ప్రవేశపెట్టబోతున్నారు. ఇలా చేయొచ్చా.. ?ఎందుకు కెసిఆర్ ఈ రూట్ ఎంచుకున్నారు ? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అప్పుల కుప్పలపై చర్చకు ధైర్యం చాలకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారా ? అసలు లెక్కేంటో చూడండి.

ఓట్ ఆన్ అకౌంట్

ఓట్ ఆన్ అకౌంట్

పేరుకు తగ్గట్టే త్వరలో ఓటింగ్‌కు వెళ్లబోతున్న ప్రభుత్వాలు స్వల్పకానికి పెట్టుకునే మధ్యంతర బడ్జెట్. మూడు నెలల నుంచి ఆరు నెలల కాలానికి పెట్టే బడ్జెట్. దేశవ్యాప్తంగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. ఎన్నికలకు వెళ్లే ఆఖరి ఏడాది ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టి మళ్లీ అధికారంలోకి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఫుల్ లెంగ్త్ చిట్టాపద్దులను ప్రచురిస్తుంది.

అయితే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పట్లో మళ్లీ ఎన్నికలు లేవు. అయినా సరే 2019-2020 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు మాత్రం ఓట్ ఆన్ అకౌంట్‌కే ఓటేశారు.

దీనికీ ఓ లెక్కుంది

దీనికీ ఓ లెక్కుంది

తెలంగాణ ప్రభుత్వ అధికారులు, ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మూడు నుంచి ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎందుకంటే కేంద్రం ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టింది. మళ్లీ ఏప్రిల్, మే లేదా జూన్ నెలల్లో కొత్త సర్కార్ కొలువుదీరి.. వాళ్లు ఫుల్ లెంగ్త్ బడ్జెట్ ప్రవేశపెడ్తారు. అప్పుడు తమకు క్లారిటీ వస్తుందని, ఆ తర్వాతే తామూ బడ్జెట్‌ను తీసుకువస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబ్తోంది.

ఎందుకంటే రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే పూర్తిస్థాయి బడ్జెట్ ఇవ్వలేకపోతున్నామనేది కెసిఆర్ సర్కార్ మాట. కొత్తగా వచ్చే ప్రభుత్వం రాష్ట్రాల మాట వింటుందని, అధిక శాతం పన్నులను రాష్ట్రాలకు విడుదల చేయొచ్చని కెసిఆర్ ఎందుకనో బలంగా నమ్ముతున్నారు. తాము కూడగట్టబోతున్న ఫోర్త్ ఫ్రంటో లేకపోతే బలమైన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో గద్దెనెక్కితే ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ కూడా మారిపోతాయనేది తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు మాట.

ఫైనాన్స్ కమిషన్‌తో ఢీ అంటే ఢీ

ఫైనాన్స్ కమిషన్‌తో ఢీ అంటే ఢీ

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పెత్తనంపై కెసిఆర్ ఇప్పటికే అనేకసార్లు పదేపదే చీవాట్లు పెట్టారు. పన్నులు అధికంగా చెల్లిస్తున్న రాష్ట్రాలకు అధిక ఆదాయాన్ని ఇవ్వకుండా ప్రతీ పధకానికీ ఢిల్లీ దగ్గర చేతులు చాపాల్సి వస్తోందనేది ఆయన మాట. ఎదుగుతున్న, మెరుగైన పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలను పట్టించుకోకుండా ప్రతీ చిన్న విషయంలో జోక్యం చేసుకోవడం సరైంది కాదని ఫైనాన్స్ కమిషన్‌కు కూడా ఆయన క్లాస్ పీకారు.

బొక్కలు బయటపడతాయనేనా ?

బొక్కలు బయటపడతాయనేనా ?

2018-2019 బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ నెత్తిన రూ.1.80 లక్షల కోట్ల రుణభారం ఉంది. దీనిపై సుమారు రూ. 11891 కోట్ల వడ్డీని ప్రభుత్వం కడ్తోంది. ఇది జీఎస్‌డిపితో పోలిస్తే 20 శాతానికిపైగానే ఉంది.తాజా లెక్కల ప్రకారం ఈ అప్పు రూ.2.5 లక్షల కోట్ల వరకూ పెరిగి ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం. ఒక వేళ ఫుల్ లెంగ్త్ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతీ హెడ్ కింద ఉన్న ప్రతీ చిన్న డీటైల్‌ను ప్రభుత్వం ప్రచురించాల్సి ఉంటుంది.

దీనికి తోడు సభలోని ప్రతీ సభ్యుడికీ దీనిపై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి. ప్రస్తుతం రాజకీయంగా బిజీ ఉన్న కెసిఆర్.. అంత టైం దీనిపై అంత ఫోకస్ పెట్టే స్థితిలో లేరు. అందుకే ప్రస్తుతానికి ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడితే మూడు నుంచి ఆరునెలల పాటు కాస్త ఊపిరి తీసుకునే సమయం వస్తుంది ఆ తర్వాత కేంద్రంలో వచ్చే ప్రభుత్వంతో సంబంధాల తర్వాత క్లారిటీ వస్తే ఫుల్త్ లెంగ్త్ బడ్జెట్ ఇవ్వొచ్చనేది కెసిఆర్ లెక్క.

నిపుణులు ఏమంటున్నారంటే

నిపుణులు ఏమంటున్నారంటే

రాష్ట్రాలు - కేంద్రం మధ్య నిధుల విషయంలో ముందు నుంచి కెసిఆర్ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టినా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ప్రతీ ఏటా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల యావరేజ్ తీసుకుని బడ్జెట్‌ను రూపొందించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువో, తక్కువో వస్తే వాటిని రివైజ్డ్ ఎస్టిమేట్స్ కింద మార్చుకునే వెసులుబాటు ఉన్నా ఈ తరహా నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని విశ్లేషిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+