మోడీ ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ పై యావత్ దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి మరియు ముక్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఈసారైనా తమకు తగిన న్యాయం జరుగుంతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నాయి.
మోడీ ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ పై యావత్ దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి మరియు ముక్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఈసారైనా తమకు తగిన న్యాయం జరుగుంతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నాయి.

నేడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.ఇందులో ముక్యంగా ప్రజలను ఆకట్టుకునే అంశాలపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.మోడీ సర్కార్ అధికారం లోకి రాగానే దేశ రూపురేఖలు మారుతాయని అందరు భావించారు.గత నాలుగు బడ్జెట్ లలో ప్రజలు ఆశించినంతగా ప్రయోజనాలు జరగలేదని విశ్లేషకుల భావన.
ఆంధ్రప్రదేశ్:
నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా మరియు విభజన బిల్లు లో ఉన్న ఇతర అంశాలను నెరవేరుస్తామని మోడీ వాగ్దానం చేసారు.గత నాలుగు బడ్జెట్ లలో ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించారు ముక్యంగా రైల్వే జోన్ గట్టిగా వినిపిస్తున్న అంశం.ఈ బడ్జెట్ లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించాలని కోరుకుంటున్నారు.
గత నాలుగు బడ్జెట్ లలో విశాఖ రైల్వే ఏర్పాటు పై ఎటువంటి ప్రస్తావన చేయలేదు గత బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన MP లు లోక్సభలో నిరసన తెలిపారు.ఈసారైనా విశాఖ రైల్వే పై సానుకూల స్పందన వస్తుందని AP ఆశిస్తోంది.ఈ ప్రూజెక్టు పూర్తయితేనే వెనుకబడిన ఉత్తరాంధ్రకు మేలుజరుగుతుంది ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి రైల్వే జోన్ కీలకంగా మారుతుందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డారు.కొత్త ప్రోజెక్టుల సంగతి అటు ఉంచితే రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పాత ట్రాక్ల పునరుద్ధరణ నత్త నడకనే సాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి.రైల్వే స్టేషన్లలో మల్టీ ఫంక్షనల్ కంప్లెక్సలు,వినోద కేంద్రాలు మరియు వెయిటింగ్ హాల్స్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.గత బడ్జెట్ లో అరా కోరా కేటాయింపుల వల్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయని రైల్వే అధికారులు అంటున్నారు.
తెలంగాణ:
ఈసారి బడ్జెట్ లో రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు దక్కుతాయని తెలంగాణ భావిస్తోంది.ఖాజీ పేట్ లో రైల్వే కోచ్ తో పాటు ఇతర ఆన్ గోయింగ్ పనులకు భారీగా నిధులు వస్తాయని భావిస్తోంది.బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న తెలంగాణకు ఏ మేరకు నిధులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.గత బడ్జెట్ పై తమ ఆశలు నిరాశలయ్యాయని ఈసారైనా తగిన ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తోంది.ప్రధానంగా తెలంగాణ ఆశిస్తున్నా ఖాజీ పేట్ రైల్వే కోచ్ అంశం పై కేంద్రం నోరు మెదపడం లేదు అలాగే రాష్ట్రము లో రైల్వే లైన్ల త్రిబులింగ్, డబ్లింగ్ పనులు చేపట్టాల్సి ఉంది దాదాపు లక్షన్నర కోట్ల గత రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు అరా కోరా నిధులు కేటాయింపులు జరిగాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications