మరికాసేపట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఒక దేశానికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడమంటే దాని వెనక ఎంతో కఠోర శ్రమ ఉంటుంది. బడ్జెట్ రూపొందించడంలో పలువురు అధికారులు కొన్ని రోజులు నిమగ్నమవుతారు. ఈ సారి కూడా బడ్జెట్ రూపకల్పనలో పలువురి అధికారుల పాత్ర ఉంది. ఇంతకీ బడ్జెట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరివి..? వారు ఎలా బడ్జెట్‌ను రూపొందించారు..

అజయ్ నారాయణ్ ఝా.
పార్లమెంటులో శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌కు ప్రాణం పోసి మరమత్తులు చేసింది మాత్రం కేంద్రప్రభుత్వంలోని పలువురు కీలక అధికారులు. వీరిలో ముందుగా ప్రస్తావించాల్సిన పేరు అజయ్ నారాయణ్ ఝా. ఈయన ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ ఉన్నతాధికారి. అంతేకాదు ఖర్చుల శాఖకు ఈయన అధిపతి. ఇక పరిపాలనలో ఆయనకు 36 ఏళ్ల అనుభవం ఉంది. రాజ్యాంగ పరమైన సంస్థల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది.

సుభాష్ చంద్ర గార్గ్
ఇక రెండో వ్యక్తి సుభాష్ చంద్ర గార్గ్. ఈయన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు ఆర్బీఐ, సెబీ, వరల్డ్ బ్యాంకులతో ఆర్థికశాఖను సమన్వయ పరచడంలో కీలకంగా వ్యవహరిస్తారు.

అజయ్ భూషణ్ పాండే
ఇక అజయ్ భూషణ్ పాండే రెవిన్యూ సెక్రటరీ. ఈయన కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్న రసీదులను పరిశీలిస్తారు. కేంద్ర బడ్జెట్‌కు తుది రూపు ఇవ్వడంలో ఈయన పాత్ర కీలకమైనది. అంతేకాదు పాండే ఆధార్‌కు సీఈఓగా కూడా ఉన్నారు. మరోవైపు జీఎస్టీ నెట్‌వర్క్‌కు ఛైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు.

రాజీవ్ కుమార్
ఆర్థిక సేవల సెక్రటరీ రాజీవ్ కుమార్. ఈయన 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారు. ఈయన 21 ప్రభుత్వ బ్యాంకులు పనితీరును పరిశీలిస్తారు. వాటి పనితీరు ఎలా ఉందో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఆ బ్యాంకుల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా... ఆర్థిక వ్యవస్థ బాగుండేలా ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతుంటారు. ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ప్రభుత్వం పథకాలకు నిధులు ఇవ్వగలదు.

అటాను చక్రవర్తి
అటాను చక్రవర్తి. ఈయన పెట్టుబడులు మరియు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ కార్యదర్శిగా ఉన్నారు. కేంద్ర యూనియన్ బడ్జెట్‌లో ఈయన పాత్ర చాలా కీలకం. ప్రభుత్వం లక్ష్యాలను అందుకునే క్రమంలో కొన్ని పెట్టుబడుల ఉపసంహరణలపై నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును సమీక్షించి మార్కెట్‌కు అనుగుణంగా లేకపోతే.. వాటిని వెంటనే గాడిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తారు.

సుశీల్ చంద్ర
సుశీల్ చంద్ర: సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(ప్రత్యక్ష పన్నులు)కు ఛైర్‌పర్సన్. ఈయన ప్రత్యక్ష పన్నుల విధానం రూపొందిస్తారు. దీంతో పాటుగా వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయ పన్ను లక్ష్యాలను నిర్దేశిస్తారు. కేంద్ర బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులకు పెద్ద పీట ఉంటుంది కాబట్టి సుశీల్ చంద్ర పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుంది. అయితే పన్నుల విధానంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న మధ్యంతర బడ్జెట్ ఎలా ఉంటుందో చూడాలి.

ప్రణబ్ కె.దాస్
ఇక పరోక్ష పన్నుల విభాగం కూడా కేంద్ర బడ్జెట్లో కీలకమైన అంశమే. దీనికి ఛైర్మెన్‌గా ప్రణబ్ కె.దాస్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క పరోక్ష పన్నుల విధానంను ఈయన పరిశీలిస్తారు. దేశీయ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎలా ఉంటుందనేదానిపై ప్రణబ్ నిర్ణయం తీసుకుంటారు.

కృష్ణమూర్తి సుబ్రమణియన్
ఇక చివరిగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కీలక వ్యక్తి కృష్ణమూర్తి సుబ్రమణియన్. ఈయన కేంద్ర ఆర్థికశాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుడు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నా కృష్ణమూర్తి మార్క్ అందులో కనిపిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications