వేతన జీవులపై వరాల జల్లు, మిడిల్ క్లాస్‌కు మిఠాయి..అంటూ ఆదాయపు పన్ను కోతపైఅంతా అనుకున్నారు. అయితే పీయూష్ గోయల్ పెట్టిన ఓ చిన్న మెలిక చాలా మంది ఆర్థికవేత్తలు,ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్‌కు కూడా బుర్రతిరిగి
వేతన జీవులపై వరాల జల్లు, మిడిల్ క్లాస్‌కు మిఠాయి..అంటూ ఆదాయపు పన్ను కోతపైఅంతా అనుకున్నారు. అయితే పీయూష్ గోయల్ పెట్టిన ఓ చిన్న మెలిక చాలా మంది ఆర్థికవేత్తలు,ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్‌కు కూడా బుర్రతిరిగింది.వాస్తవానికి పన్ను ఆదాయం(ట్యాక్సబుల్ ఇన్కం)రెండున్నర లక్షల నుంచి ఐదులక్షలకు పెంచారని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడోమెలిక ఉంది. ట్యాక్స్ స్లాబుల్లో ఎలాంటి మార్పులూ చేయని కేంద్రం..ఇందుకోసం 87A అనే సెక్షన్‌ను ఉపయోగించుకుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో
కేవలం రిబేట్ మాత్రమే ప్రకటించింది.రూ.5 లక్షలలోపు ట్యాక్సబుల్ ఆదాయం ఉన్న వాళ్లంతా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలాంటిపన్నూ కట్టాల్సిన అవసరం లేదని ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ స్పష్టంగా సభలో ప్రకటించారు. దీనికి తోడు అటు పీఎఫ్, ఇన్సూరెన్స్ సహా వివిధ పెట్టుబడులు చేసినవాళ్లకు రూ.6.5 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరంలేదని బాహాటంగా చెప్పారు. కానీ ఓ చిన్న మెలికే కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తోందని యర్న్స్ అండ్ యంగ్ లాంటి ఆడిట్ సంస్థలు చెబ్తున్నాయి.

గరిష్ట ప్రయోజనం
ఈ లెక్కన రూ.5 లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వాళ్లకే దీని వల్ల రూ.12600 వరకూ గరిష్ట ప్రయోజనం ఉండబోతోంది. అలా కాకుండా రూ.5 నుంచి 10 లక్షలలోపు ఆదాయం ఉన్న వాళ్లకు సాధారణంగానే 20 శాతం పన్ను, రూ.10 లక్షలపైన ఆదాయం ఉన్న వాళ్లకు 30 శాతం పన్ను కొనసాగబోతోంది. అయితే స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40 నుంచి 50
వేలకు పెంచడం వల్ల 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న వాళ్లకు రూ.2 వేలు, 30
శాతం ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న వాళ్లకు రూ.3 వేల లబ్ధి చేకూరబోతోంది.

ఈ బడ్జెట్ వల్ల
సింపుల్‌గా, ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వేతన జీవులకు ఈ బడ్జెట్ వల్ల ఊరట ఉండబోతోంది. అయితే మెజార్టీ మంది (సుమారు 30 శాతం) ఈ ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటారు కాబట్టి వాళ్లంతా ఈ బడ్జెట్ వల్ల రూ.13 వేల వరకూ
పన్ను ఆదా ప్రయోజనాన్ని పొందబోతున్నా

ట్యాక్సబుల్ ఆదాయం
రూ.5 లక్షల ట్యాక్సబుల్ ఇన్‌కం అంటే?ఇంకో యాంగిల్‌లో చూడాలంటే.. రూ.5 లక్షల ట్యాక్సబుల్ ఆదాయం వస్తోందంటే.. వాళ్ల వాస్తవ ఆదాయం ఏడెనిమిది లక్షల వరకూ ఉండొచ్చు. అది ఎలా ఉంటే ఉదాహరణకు మీ నెల జీతం రూ.50 వేలు ఉందని అనుకుందాం. అప్పుడు ఏడాదికి ఈ సొమ్ము రూ.6 లక్షలు అవుతుంది. అందులో సెక్షన్ 80సి కింద రూ.1 లక్షన్నర, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు, ప్రొఫెనల్ ట్యాక్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్యూషన్ ఫీజ్ తీసేస్తే మీ ఆదాయం రూ.5 లక్షలలోపే వస్తుంది.అప్పుడు మీరు ట్యాక్స్ పరిధిలోకి రారు.

హౌసింగ్ లోన్ ఉంటే
ఒక వేళ హౌసింగ్ లోన్ ఉంటే మరింత ప్రయోజనం ఉంటుంది. అంటే నెలకు రూ.60-70 వేల వరకూ జీతం/ఆదాయం పొందే వాళ్లంతా ఈ బడ్జెట్ వల్ల ఎంతో లబ్ధిని పొందబోతున్నారు. అలా కాకుండా డిడక్షన్స్ అన్నీ తీసేసిన తర్వాత మీ పన్ను ఆదాయం రూ.5,00,001 ఉన్నా సరే మీరు 20 శాతం ట్యాక్స్ బ్రాకెట్ పరిధిలోకి వస్తారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications