2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆవులను పరిరక్షిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ ఏడాది మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ కావడంతో ఇందులో గోవులను పరిరక్షించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారు. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ప్రవేశపెట్టని 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో గోసంరక్షణకు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం కింద రూ.750 కోట్లు కేటాయింపులు జరిపింది. ఇది తక్షణమే అమల్లోకి రానుంది.
రాష్ట్రీయ కామధేను ఆయోగ్ కింద గోవుల సంరక్షణ, గోవుల పెంపకంలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు కేంద్రం సిద్ధం చేస్తోంది. గోసంరక్షణలో భాగంగా చట్టాలు సక్రమంగా అమలు అయ్యేలా ఆయోగ్ సమీక్షలు చేస్తుంది.

ఇక ఇప్పటికే గోవులను సంరక్షించేందుకు రాజస్థాన్ మధ్యప్రదేశ్‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వాలు గోసంరక్షణ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాయి. గోవులను సంరక్షించేందుకు ఈ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మాత్రం ఓటమి చవిచూసింది. ఇక గోసంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి పీయుష్ గోయల్ వెల్లడించారు.
ఇక ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో చాలా కీలక వర్గాలకు ఊరట కలిగించారు. ముఖ్యంగా వేతన జీవులకు పన్ను మినహాయింపును రూ.5లక్షలు చేశారు. మరోవైపు రైతులకు కూడా ఎన్నికల ముందు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకంలానే దేశవ్యాప్తంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలను నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తామని మంత్రి పీయుష్ గోయల్ ప్రకటించారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications