మధ్యంతర బడ్జెట్ కు సంబంధించిన కొన్ని ముఖ్య అంశాలు.
లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2018-19 కి ద్రవ్యలోటు అంచనా 2.4 శాతం అన్నారు.కరెంటు అకౌంట్ లోటును 5.6 శాతం నుండి 2.5 శాతానికి తగ్గించాం అన్నారు.
లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2018-19 కి ద్రవ్యలోటు అంచనా 2.4 శాతం అన్నారు.కరెంటు అకౌంట్ లోటును 5.6 శాతం నుండి 2.5 శాతానికి తగ్గించాం అన్నారు.

- తమ ప్రభుతం అధికారంలోకి వచ్చినప్పటినుండి రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశామన్నారు అలాగే బ్యాంకులకు రూ.2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించాం అన్నారు.
- రైతుల ఆదాయం రెట్టింపు జరిగిందని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు,మరుగుదొడ్లు,విద్యుత్ సౌకర్యం కల్పించడమే మా లక్ష్యం అని అన్నారు.
- ఆర్థికవృద్ధి లో ప్రపంచంలోనే వేగంగా దూసుకుపోతున్నాం అని అలాగే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం అని గోయల్ అన్నారు.
- తమ ప్రభుత్వం లో ధరల నడ్డి విచారం అని తద్వారా ద్రవ్యోల్బణం దిగివచ్చింది అన్నారు.
- ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఇబ్బదులను అధిగమిస్తున్నాయని,అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చాం అని అన్నారు.
- అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజెర్వేషన్ కల్పించాం అన్నారు అలాగే ఉపాధి హామీ కింద రూ.60 వేల కోట్లు కేటాయించామని అన్నారు.
- గోకుల్ మిషన్ కి రూ.750 కోట్లు కేటాయింపు అలాగే గో ఉత్పాదకత పెంచడం కోసం రాష్ట్రీయ కాంధేన్ యోజన.
- కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తాం అని పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచుతున్నాం అన్నారు.కొత్త పెన్షన్ విధానం నెలకు రూ.3000 రూపాయలు అందిస్తాం అన్నారు.
- ESI లిమిట్ ను రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతున్నాము అన్నారు.
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిది కింద ఏడాదికి రూ.6000 రూపాయల పెట్టుబడి సాయం.కిసాన్ క్రెడిట్ కార్డులపై 2 శాతం వడ్డీ రాయితీ.


Click it and Unblock the Notifications