రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ ప్రకటనలు ఉండొచ్చు !
బడ్జెట్ అనగానే.. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు. సామాన్యుడి నుంచి కార్పొరేట్ అధిపతి వరకూ ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి ఈ బడ్జెట్ నుంచి కోరుకుంటారు. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో తాయిలాలు ప్రకటించడానికి ప
బడ్జెట్ అనగానే.. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు. సామాన్యుడి నుంచి కార్పొరేట్ అధిపతి వరకూ ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి ఈ బడ్జెట్ నుంచి కోరుకుంటారు. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో తాయిలాలు ప్రకటించడానికి ప్రభుత్వం దగ్గర అవకాశాలుతక్కువేఉంటాయి.అయినప్పటికీ రాబోయేఎన్నికలనుదృష్టిలో ఉంచుకని మోడీ సర్కార్ తనదైన స్టైల్లో భారీ ప్రకటనలు గుప్పించేందుకు ఈ బడ్జెట్‌ను వేదిక చేసుకోబోతోంది.

ఇది ఎన్నికలకు వెళ్లే ముందు ప్రవేశపెట్టే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అంటే ఈ రెండు మూడు నెలల కాలానికి.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ జమాఖర్చులు, కేటాయింపులు చూపే ఓ తాత్కాలిక వ్యవస్థ. అయితే ఈ బడ్జెట్లో భారీ ప్రకటనలు చేయడం బాగా అరుదు. గత పాతికేళ్లలో ఎప్పుడూ వోట్ ఆన్ అకౌంట్లో జిమ్మికులను కేంద్రం చేపట్టలేదు. మరి ఈ
సారి మాత్రం అలాంటి సంప్రదయానికి మోడీ సర్కార్ చరమగీతం పాడేట్టు కనిపిస్తోంది. రైతులను మచ్చిక చేసుకునే విధంగా ఇందులో ఈ సారి భారీ ప్రకటనలు, అలానే పన్ను
రాయితీలనూ వెల్లడించి సామాన్యులను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
పన్నుల మార్పు విషయంలో స్పష్టత లేనప్పటికీ కొన్ని ప్రకటనలు మాత్రం రావొచ్చని ఢిల్లీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. వ్యక్తిగత పన్నుల రేట్లలో మరిన్ని మార్పులు
ఉండొచ్చని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే సామాన్యులు, ఉద్యోగుల జేబులో ఎంత ఎక్కువ డబ్బు ఉంచితే ఆ ప్రయోజనం అంతా మళ్లీ తిరిగి ఆర్థిక వ్యవస్థకే ఉంటుందని కేంద్రమే పదే పదే చెబ్తూ వస్తోంది. పేదలందరికీ మెరుగైన వైద్యచికిత్స అందించేందుకు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్‌ను ప్రకటించిన కేంద్రం.. దానిపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
తక్షణ అవసరం ఉన్న రంగాలకు అధిక ప్రాధాన్యం తప్పకుండా ఇస్తామని.. అది మధ్యంతరమా.. లేక ఓట్ ఆన్ అకౌంట్ అనే అంశంపై సంబంధం లేదని అరుణ్ జైట్లీ ఈ పాటికే ఓ స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఇలాంటి సందర్భాల్లోనే అప్పటి
ఆర్థిక మంత్రి చిదంబరం పరోక్ష పన్నుల్లో కోత విధించారు. అలానే ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్న ప్రణబ్ ముఖర్జీ కూడా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించారనే అంశాన్ని బిజెపి గుర్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ స్టాండ్ ఏంటో ప్రజానికానీకి తెలియజేసే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటనలు ఉంటాయనిపిస్తోంది.
ఆరోగ్య బీమా కొనుగోలుపై రాయితీలు, అధిక స్టాండర్డ్ డిడక్షన్, శ్లాబుల్లో మార్పులు వంటివి ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది
శాతం రిజర్వేషన్‌ను ఇచ్చిన కేంద్రం.. దీనిపై కూడా మరింత స్పష్టత ఇవ్వొచ్చు. మొత్తానికి ఇది ఇంటెరిం బడ్జెట్ అయినా.. అంచనాలు మాత్రం అధికంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications