ఫిబ్రవరి 1, 2019 న ప్రవేశపెడుతున్న తాత్కాలిక బడ్జెట్ లో ఆశించిన ఫలితాలు పెద్దగా ఏమి ఉండవని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫిబ్రవరి 1, 2019 న ప్రవేశపెడుతున్న తాత్కాలిక బడ్జెట్ లో ఆశించిన ఫలితాలు పెద్దగా ఏమి ఉండవని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈసారి బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రజలకు ఊరటనిచ్చే అంశాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేము ఎందుకంటే ఇది తాత్కాలిక బడ్జెట్ కనుక.

గతంలో,తాము ఎన్నో తాత్కాలిక బడ్జెట్లు చూశామని,వాటిలో చెప్పుకోతగ్గ అంశాలు ఏమి లేవని అందుకే అంచనాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.
మధ్యతరగతికి ప్రజలకు సంబంధించి కొంత పన్నుల ఉపశమనాన్ని చూడవచ్చు. నివేదికల ద్వారా చూస్తే రెండు విషయాల పై కాస్త అంచనా ఉంది: మొదటిది పన్ను స్లాబ్ రూ. 2.5 లక్షల నుంచి రు. 3 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. దీని అర్థం, 3 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు బాధ్యత ఉంటుంది.
కొన్ని నివేదికల ప్రకారం ఈ స్లాబ్ రూ .5 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు. పన్నుల స్లాబ్ ప్రస్తుత స్థాయి రూ.2.5 లక్షల నుండి రు. 3 లక్షలకు పెంచవచ్చని భావించవచ్చు, దీని వల్ల ద్రవ్య ఒత్తిడి కాస్త తగ్గే అవకాశం లభిస్తుంది. ఇది చాలా పన్ను ఉపశమనం కలిగించకపోవచ్చు.
దీనితో పాటు,sec 80 c పన్ను ప్రయోజనం రూ. 2 లక్షలకు విస్తరించే అవకాశముంది.ఇది జరిగితే కూడా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.
ఇవి తప్ప,మిగతా మార్పులను ఎక్కువ చూడలేమని, ఇది కేవలం ఒక తాత్కాలిక బడ్జెట్ మాత్రమే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications