For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండ్లలో మన టాటా సంస్థకు ఏ ర్యాంకు వచ్చిందో తెలుసా..?

|

దేశీయ సంస్థ టాటా గ్రూపు గ్లోబల్ బ్రాండ్ జాబితాలో తొలి 100 స్థానాల్లో నిలిచింది. టాటా బ్రాండ్ 37శాతం పెరిగి 19.5 బిలియన్ డాలర్లతో ప్రపంచ బ్రాండ్ల సరసన చోటు సంపాదించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. టాటా బ్రాండ్ పేరు మీద ఉత్పత్తులు సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు ఉన్నాయి. లండన్‌కు చెందిన ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ బ్రాండ్లకు సంబంధించి ఓ రిపోర్టును తయారు చేసింది. ఇందులో 2018లో టాటా బ్రాండ్ 104వ స్థానంలో నిలవగా ఈ సారి మాత్రం 86వ స్థానంలో నిలిచింది. అయితే దేశీయ ఉత్పత్తిలో ఒక్క టాటా సంస్థ బ్రాండ్‌కు మాత్రమే జాబితాలో చోటు లభించింది.

టాటా సంస్థకు ఇంతటి మంచి గుర్తింపు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు టాటా సన్స్ ఛైర్మెన్ ఎన్‌ చంద్రశేఖరన్. ఈ నివేదికతో తమపై మరింత బాధ్యత పెట్టిందని ఆమేరకే సంస్థ కష్టపడి కస్టమర్ల మనసులను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. టాటా గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారానే బ్రాండ్ ఇమేజ్ ఎక్కువగా పెరిగిందని బ్రాండ్ ఫినాన్స్ సీఈఓ డేవిడ్ హెయిగ్ అభిప్రాయపడ్డారు.

Tata enters list of top 100 valuable brands

అంతేకాదు టాటా గ్రూపునకే చెందిన టాటా ఆటోమోటివ్ మరియు స్టీలు కంపెనీలు కూడా బ్రాండ్ వాల్యూ పెరగడంలో దోహదపడ్డాయని తెలుస్తోంది. 2019లో టాటా బ్రాండ్ గణనీయమైన వృద్ధి నమోదు చేసుకుందని బ్రాండ్ ఫైనాన్స్ సీఈఓ డేవిడ్ హెయిగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు సంబంధించిన బ్రాండ్‌లపై సర్వే చేయగా టాప్ 100 స్థానాల్లో భారత్‌కు చెందిన టాటా సంస్థ మాత్రమే చోటు సంపాదించుకుందని హెయిగ్ వెల్లడించారు.

English summary

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్రాండ్లలో మన టాటా సంస్థకు ఏ ర్యాంకు వచ్చిందో తెలుసా..? | Tata enters list of top 100 valuable brands

The ‘Tata’ brand has entered the list of Top 100 most valuable global brands, according to the Brand Finance Global 500, 2019 report released at the World Economic Forum in Davos.Climbing from the 104th to the 86th position this year, Tata is the lone Indian brand in the Top 100.
Story first published: Monday, January 28, 2019, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X