మోటార్ సైకిళ్లపై సగానికి సగం సుంకం తగ్గించేందుకు భారత్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అదేసమయంలో మద్యంపై అధిక సుంకం విధించడాన్ని తప్పుబట్టారు ట్రంప్. వాణిజ్య చట్టంపై వైట్ హౌజ్‌లో మాట్లాడిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోటార్ సైకిల్ పై భారత్‌లో 100శాతం సుంకం విధించేవారు. కేవలం 50శాతం పన్ను మాత్రమే విధించేలా చర్చలు జరిపి భారత్‌ను ఒప్పించగలిగానని అదికూడా రెండు నిమిషాలు మాత్రమే చర్చలు జరిపామని వెల్లడించారు. ఇక వైన్స్ పై అధిక సుంకం విధించడాన్ని మాత్రం ట్రంప్ తప్పుబట్టారు. మద్యంపై భారత్‌కు 150శాతం అధికంగా సుంకం విధిస్తోందని అదే అమెరికాలో మాత్రం ఏ సుంకం ఉండదని ట్రంప్ అన్నారు.

గతేడాది దిగుమతి చేసుకుంటున్న మోటార్‌సైకిళ్లపై భారత్ 50శాతం సుంకాన్ని తగ్గించింది. ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ లాంటి బైకులపై అధిక సుంకాన్ని తగ్గించింది. అమెరికా దిగుమతి చేసుకునే భారత బైకులపై అధిక సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో భారత్ అమెరికా మోటార్ సైకిళ్లపై సుంకాన్ని తగ్గించింది. పరస్పర వాణిజ్య చట్టం మరొక దేశానికి సంబంధించిన వస్తువుల ధరపై ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి వస్తుందని ట్రంప్ చెప్పారు.
ఎవరికీ అవగాహన లేకుండా అమెరికా నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై ఇష్టం వచ్చినట్లు పన్నులు సుంకాలు విధిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. అదే సమయంలో వారు మాత్రం కొన్ని నిబంధనలు విధించుకున్నారు. కొన్ని దేశాలు అమెరికా ఉత్పత్తులను విక్రయించేందుకు అనుమతి ఇవ్వడం లేదని ట్రంప్ ఆరోపించారు. పరస్పర వాణిజ్య చట్టం అన్ని సమస్యలకు చెక్ పెడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications