For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరో రెండు వ్యాపార రంగాల్లోకి పేటీఎం అడుగుపెట్టే అవకాశం: సీఎఫ్ఓ మధుర్ దియోరా

|

2019లో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం అడుగుపెట్టబోతోందంటూ ఆ సంస్థ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మదుర్ దియోరా అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్నటికే కెనడా, జపాన్‌ దేశాల్లోని మార్కెట్లలో పేటీఎం అడుగుపెట్టిందని గుర్తుచేసిన దియోరా... ఇప్పటికే అక్కడ లాభాలను చూస్తోందని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పారు.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి అడుగుపెడుతామని చెప్పిన దియోరా మాత్రం అవి ఏ మార్కెట్లో స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు ఎప్పుడు అడుగుపెడుతారో అనేదానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఆ మార్కెట్లపై స్టడీ చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ప్రపంచ దిగ్గజ కంపెనీ బెర్క్‌షైర్ హాత్‌వే పేటీఎం మాతృసంస్థ వన్ 97లో 25 బిలియన్ రూపాయల వాటాను గతేడాది ఆగష్టులో కొనుగోలు చేసింది.

Paytm may enter two more developed markets in 2019, says CFO at Davos

2010లో పేటీఎం సంస్థను స్థాపించారు. చైనా దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూపునకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూపులో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం పలు సంస్థల నుంచి పేటీఎం గట్టి పోటీ ఎదుర్కొంటోంది. డిజిటల్ పేమెంట్స్ విభాగంలో గూగుల్ పే, ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ల నుంచి పేటీఎం గట్టి పోటీ ఎదుర్కొంటోంది.

English summary

మరో రెండు వ్యాపార రంగాల్లోకి పేటీఎం అడుగుపెట్టే అవకాశం: సీఎఫ్ఓ మధుర్ దియోరా | Paytm may enter two more developed markets in 2019, says CFO at Davos

Digital payments company Paytm is considering foraying into 1-2 more developed markets in 2019, Chief Financial Officer Madhur Deora said on Wednesday at the World Economic Forum in Davos.
Story first published: Thursday, January 24, 2019, 17:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X