దావోస్: ఆర్థిక పరిమాణంలో చైనాను భారత్ క్రమంగా అధిగమించే దిశగా సాగుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2019లో పాల్గొని ప్రసంగించారు. ఆయన స్ట్రాటెజిక్ అవుట్ లుక్ ఫర్ సౌత్ ఏషియా అనే అంశంపై మాట్లాడారు.
దక్షిణాసియా దేశాల్లో ఎకనామిక్ సైజ్ పరంగా చూస్తే క్రమంగా చైనాను భారత్ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. చైనా వృద్ధిరేటు నెమ్మదిస్తున్నప్పటికీ, భారత వృద్ధి రేటు క్రమంగా పెరుగుతోందని చెప్పారు. రాబోయే కాలంలో ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్ మంచి స్థానంలో నిలబడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ రెండు దేశాల మధ్య పోటీ ఇరువురికీ ప్రయోజనం కలిగిస్తుందన్నారు. నేపాల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో మౌలిక ప్రాజెక్టులపై చైనా పని చేస్తోందని, భవిష్యత్తులో భారత్ కూడా ఈ స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, 2017 ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన డాటా ప్రకారం భారత్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి 2.59 లక్షలుగా ఉంది. చైనా జీడీపీ 12.23 లక్షల కోట్లతో ఉంది. అంటే మన దేశం కంటే నాలుగున్నర రెట్లు ఉంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications