సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరుగుతుండటంతో, మోడీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు సాధారణ ప్రజలను ఆకర్షించడానికి ₹ 1 లక్ష కోట్లు ఖర్చు చేయాలని నిర్ణఇంచింది.
సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరుగుతుండటంతో, మోడీ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు సాధారణ ప్రజలను ఆకర్షించడానికి ₹ 1 లక్ష కోట్లు ఖర్చు చేయాలని నిర్ణఇంచింది.

వ్యవసాయ రుణ మాఫీలు
వీటిలోరైతులకు సంబందించిన వ్యవసాయ రుణ మాఫీలు, భారీ ర్యాలీలు, ఫ్లయింగ్ సముద్ర విమానాలు మొదలైనవి ఉన్నాయి.
రాయిటర్స్ నివేదిక వెల్లడించిన దాని ప్రకారం భారీ ఖర్చులు ఎన్నికల కొరకు ప్రభుత్వం భరిస్తుందని అన్నారు.
ఈ ఖర్చులు బహుశా బడ్జెట్ లోటును తగ్గించడానికి ప్రణాళికలను ఆలస్యం చేశాయని పేర్కొంది.

తాత్కాలిక బడ్జెట్
ఫిబ్రవరి 1 న తాత్కాలిక బడ్జెట్ సమర్పించనుంది. ఈ బడ్జెట్లో రైతులకు అనేక ఆకర్షణీయమైన కార్యక్రమాలు ప్రత్యేకంగా ప్రకటించనున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వం SME లను ప్రోత్సహించడానికి ఉద్యోగ రిజర్వేషన్లు మరియు విధానాలను ప్రకటించింది.

ఆకర్షణీయమైన కార్యక్రమాలు
వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు బ్యాంకుల ఖాతాలకు డబ్బు నేరుగా ప్రత్యక్ష బదిలీ. వడ్డీ లేని రుణాలు అందించే మరో ప్రణాళిక సిద్ధం చేసింది.
మోడి ప్రభుత్వం ఎన్నికల తేదీల ప్రకటన మరియు ఎన్నికల నియమావళి కోడ్ అమలుకు ముందు ఈ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నది.

ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి
రెండు రోజుల ముందు ఈ వారంలో, బిజెపి ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక విధానాన్ని పార్టీ కోరిందన్నారు.

స్టేట్ బ్యాంక్ గ్రూప్
కొన్ని ప్రభుత్వ వర్గాలు మర్లాడుతూ రైతులకు వడ్డీ లేని రుణాలు సంవత్సరానికి ₹ 12,000 కోట్ల వ్యయం అవుతుంది అన్నారు. రుణాలు స్టేట్ బ్యాంక్ గ్రూప్ ద్వారా ఇవ్వబడుతుంది. అయినప్పటికీ, పెద్ద మొత్తంలో ఉన్న వడ్డీ రుణాలు కూడా ప్రభుత్వంచే భర్తీ చేయాలి.
ఇంకా,ఇతర ఆకర్షణీయమైన పథకాల అమలుకు ఈ మొత్తం సరిపోదు. వివిధ పథకాలకు ప్రభుత్వానికి మరో 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది.

జిఎస్టి రేటు తగ్గింపు
వ్యక్తిగత మరియు వాణిజ్య పన్ను రాయితీలు కారణంగా ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుంది. జిఎస్టి రేటు తగ్గింపు సంవత్సరానికి ₹ 13,000 కోట్ల రాబడి నష్టానికి దారి తీస్తుంది.

సొంత భూమి ఉన్న రైతులకు
పైన పేర్కొన్న ప్రకారం,సొంత భూమి ఉన్న రైతులకు హెక్టారుకు ₹ 2,000 ₹ 4,000 రూపాయల పంట సహాయం ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.
ఇది ఖరీదైనప్పటికీ, ప్రజలను ఆకర్షించడానికి ఇది ప్రభావవంతమైనది.
ప్రభుత్వం ఈ ఎంపికను ఎంచుకున్నట్లయితే, అది వడ్డీ లేని రుణాలు వంటి ఇతర ఎంపికలను పరిగణించకపోవచ్చు.
అయితే, ఇది ప్రభుత్వ అధికారులచే ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు.


Click it and Unblock the Notifications