జూనియర్ అసిస్టెంట్ సంపాదన రూ.100 కోట్లు చిక్కిన చేప మీరే చూడండి.
ఈరోజుల్లో డబ్బు సంపాదించాలి అంటే చాలా కష్టం ఎంతో కష్టపడితే కానీ మనం సంతోషంగా జీవించడానికి డబ్బు సరిపోతుంది. కానీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలా సులువుగా డబ్బు సంపాదించవచ్చు అని మళ్ళీ ఒక ప్రభుత్వ ఉద్యోగి రుజువు చేసాడు ఏంటో అది మిరే చూడండి.
అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో భారీ అవినీతి చేప చిక్కింది. సాధారణ ఉద్యోగి అనతికాలంలోనే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించి అధికారులు సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు. వివరాలలోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్.పి.డి దివాకర్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో పట్టుబడిన ఆస్తుల వివరాలు చూసి అధికారులు అవాక్కయ్యారు. దివాకర్‌తో పాటు ఆయన తల్లి వెంకట సుబ్బలక్ష్మి, సోదరుడు కిరణ్‌కుమార్‌ల పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తులను అధికారులు గుర్తించారు. దివాకర్ పేరిట పలు ప్రాంతాల్లో నాలుగు భవంతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.అలాగే 7ఇళ్ల స్థలాలు,44 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

సోదరుడు కిరణ్‌కుమార్ పేరిట ఆరు ఇళ్లస్థలాలు, 23 ఎకరాల 11సెంట్ల వ్యవసాయ భూమి, మొత్తం మీద 19 ఇళ్లస్థలాలు, నాలుగు భవంతులు, 85ఎకరాల వ్యవసాయ భూమితో పాటు పట్టుబడిన ఇతర వస్తువులు చూసి అధికారులు విస్తుపోయారు. అరకిలో బంగారం, ఐదు కిలోల వెండి వస్తువులు, రూ.5లక్షల నగదు, రూ.60వేల విలువ చేసే విదేశీ కరెన్సీ, 5 కార్లు, 2 ద్విచక్ర వాహనాలతో పాటు రూ.30లక్షల విలువ చేసే గృహోపకరణాలు గుర్తించారు. అనిశా అధికారులు గుర్తించిన వాటిలో సుమారు రూ.5 లక్షల విలువైన రోలెక్స్‌వాచీ, ఒక్కోటి రూ. లక్ష విలువైన మరో నాలుగు వాచీలు ఉన్నాయి. అనిశా డిజిపి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని ఆశాఖ అదనపు ఎస్పి రమాదేవి వెల్లడించారు.


Click it and Unblock the Notifications