శుభవార్త..! RTA ఆఫీస్ కు వేళ్ళాల్సిన అవసరం లేదు ఇక నుంచి అన్ని షోరూం లోనే
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి బండి కొనాలి అని ఆశగా ఉంటుంది. ఒకవేళ బండి కొన్న దాని రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ RTA ఆఫీస్ చుట్టూ తిరగాలి.కానీ ఇప్పుడు మేము చెప్పేది మీరు వింటే కచ్చితంగా ఎగిరి గంతేస్తారు అది ఏంటో తెలుసా?

కొత్త బండి
కొత్త బండి కొన్నవారికి ఇక నుంచి రిజిస్ట్రేషన్ కోసం RTA ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు ఇకనుంచి మీరు వాహనం ఎక్కడ కొన్నారో అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాహనదారులకు ఊరట ఇచ్చేలాగా ప్రభుత్వం ఒక జిఓ జారీ చేసింది.

పర్మనెంట్ రిజిస్ట్రేషన్
పర్మనెంట్ రిజిస్ట్రేషన్ , హై సెక్యూరిటీ మరియు నెంబర్ ప్లేట్ అన్ని ఇకనుంచి షో రూమ్ లోనే తీసుకోవచ్చు అంతే కాదు ఇప్పటి వరకు ఉన్న తాత్కాలికంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఏకంగా ఒక్కేసారి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేస్తారు.

తెలంగాణాలో
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానం విజయవంతగా అమలు అవుతున్న సమయంలో ఇదే విధానాన్ని తెలంగాణాలో కూడా అమలు చేయాలి అని రవాణా శాఖ కసరత్తులు చేస్తోంది. మొదట హైదరాబాద్ లో మొదలు పెట్టి తర్వాత రాష్ట్రము మొత్తం ఈ విధానం తీసుకోని వస్తాము అని సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్
దీనికోసం ఆంధ్రప్రదేశ్ అనుభవాలను లెక్కలోకి తీసుకోని ప్రధానంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి విధివిధాలను రుపొందానించనున్నారు. ప్రస్తుతం ఉన్న పద్దతులలో మార్పులు జీవితకాలం పన్నుల చెల్లింపులలో ఈ కమిటీ పరిశీలనించనుంది.

రెండు కన్నా ఎక్కువ
ఇక ఒకే వ్యక్తి రెండు కన్నా ఎక్కువ వాహనాలు ఉంటే వారికీ అదనంగా 2 శాతం పన్ను తీసుకుంటున్నారు. ఇలాంటి అదనపు పన్ను వసూళ్ల పై ఎలాంటి పద్దతిలు పరిగణలోకి తీసుకోవాలో అని అధికారులు చూస్తున్నారు.అన్ని కోణాలలో పరిశీలించిన తర్వాత ఈ జీవోని అమలు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.

ఆదాయం
అయితే ఈ విధానంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతుంది అని కొంతమంది అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications