For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ దీపావళి బంపర్ ఆఫర్ గంటకి కోటి రూపాయలు లోన్ ఏంటో మీరే చూడండి.

By girish
|

చిన్న మరియు మధ్య పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీపావళి బహుమతి ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్న మరియు మధ్య పరిశ్రమల అభివృద్ధి కోసం MSME లోన్ సౌకర్యాన్ని ప్రారంభించారు. దీని ప్రకారం కేవలం 59 నిమిషాల్లో రూ.కోటి వరకు రుణం మంజూరీ పొందవచ్చు. ఇది కాకుండా చిన్నతరహా వ్యాపారాలకు తీసుకోనే రుణాలపై 2 శాతంమినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. లఘు పరిశ్రమల రంగానికి 12 కీలక నిర్ణయాలను వెల్లడించారు.

చిన్న మరియు మధ్య పరిశ్రమలకి ప్రభుత్వ సపోర్ట్ అండ్ ఔట్ రీచ్ ఇనిషియేటివ్ లాంచ్ ఈవెంట్ లో 59 నిమిషాల లోన్ పోర్టల్ లాంచింగ్ ని ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ MSME లేదా లఘు పరిశ్రమల ద్వారా కోట్లాది ప్రజలు ఉపాధి పొందుతున్నారని మోడీ అన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది MSMEలోనే పని చేస్తున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, లఘు, మధ్య పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.

మోడీ దీపావళి బంపర్ ఆఫర్ గంటకి కోటి రూపాయలు లోన్ ఏంటో మీరే చూడండి.

ఈ కార్యక్రమంలో 3 శాతం ఉన్న రుణంపై వడ్డీ సహాయాన్ని 5 శాతానికి పెంచుతున్నట్టు మోడీ ప్రకటించారు. జీఎస్టీ కింద వచ్చే MSME పరిశ్రమలు తీసుకొనే రూ.కోటి వరకు కొత్త రుణాలు లేదా ఇంక్రిమెంటల్ లోన్లపై వడ్డీలో 2% తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రధాన సమస్య రుణాలు పొందడమేనని.. అందువల్ల లోన్ పోర్టల్ ప్రారంభించినట్టు చెప్పారు.నాలుగేళ్ల క్రితం తాము అధికారంలోకి రాకముందు భారత్ ర్యాంకింగ్ 142 ఉండేదని ప్రస్తుతం 77వ ర్యాంకుకు చేరినట్టు తెలిపారు. త్వరలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ టాప్-50కి చేరనుందన్నారు.మోడీ ఆస్తులు ఎంతో తెలుసా?

Read more about: loan
English summary

మోడీ దీపావళి బంపర్ ఆఫర్ గంటకి కోటి రూపాయలు లోన్ ఏంటో మీరే చూడండి. | Loan in 59 minutes for MSMEs Launched by Modi

At a time when the Micro, Small and Medium Enterprises (MSMEs) in the country are facing difficulty in raising funds
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X